Under 19 World Cup : శతక్కొట్టిన ఆరోన్ జార్జ్..అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
Under 19 World Cup : భారత్ అండర్ 19 జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. రికార్డు స్థాయిలో పదోసారి టైటిల్ పోరుకు రెడీ అయింది. సెమీఫైనల్లో భారత్ అండర్ 19 జట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ పై విజయం సాధించింది
Under 19 World Cup
భారత కుర్రాళ్లు మరోసారి దుమ్మురేపారు. అండర్ 19 ప్రపంచకప్(Under 19 World Cup) టైటిల్ కు అడుగుదూరంలో నిలిచాడు. టోర్నీ ఆరంభం నుంచీ అదరగొడుతున్న భారత్ అండర్ 19 జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. రికార్డు స్థాయిలో పదోసారి టైటిల్ పోరుకు రెడీ అయింది. సెమీఫైనల్లో భారత్ అండర్ 19 జట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ పై విజయం సాధించింది.
ఆరోన్ జార్జ్ సెంచరీతో చెలరేగితే.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 310 పరుగుల భారీస్కోరు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లు ఫైసల్ షినోజాడా, ఉజైరుల్లా నియాజై సెంచరీలతో చెలరేగారు. నియాజై విధ్వంసానికి భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా నియాజై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఫలితంగా ఆఫ్ఘనిస్థాన్ భారీ టార్గెట్ ను భారత్ ముందుంచింది.
భారీ టార్గెట్ కావడంతో ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా కాస్త ఒత్తిడి ఉంటుంది. కానీ భారత యువ ఓపెనర్లు దూకుడే మంత్రంగా ఆడారు. తొలి వికెట్ కు 9.1 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలానే రెచ్చిపోయాడు. భారీ షాట్లతో ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ అండర్ 19 ప్రపంచ కప్(Under 10 World Cup) టోర్నీలో అతనికిది మూడో హాఫ్ సెంచరీ. వైభవ్ సూర్యవంశీ 68 ( 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రన్స్ కు ఔటవగా.. తర్వాత ఆరోన్ జార్జ్ , కెప్టెన్ ఆయుశ్ మాత్రే అదే దూకుడు కొనసాగించారు. రెండో వికెట్ కు 114 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. మాత్రే 62 (5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. మరోవైపు ఆరోన్ జార్జ్ మాత్రం నిలకడగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాకౌట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన 9వ భారత బ్యాటర్ గా నిలిచాడు.
విహాన్ మల్హోత్రా కూడా జత కలవడంతో భారత్ అండర్ 19 ప్రపంచకప్(Under 10 World Cup) జట్టు 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో పదోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. అలాగే వరుసగా ఆరు ఎడిషన్లలో ఫైనల్ చేరుకున్న జట్టుగా నిలిచింది. 2016, 2018, 2020, 2022, 2024లలో కూడా భారత్ ఫైనల్ కు దూసుకొచ్చింది. అలాగే అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగానూ రికార్డులకెక్కింది.
Cab Strike :ఓలా,ఉబర్,ర్యాపిడో క్యాబ్స్ సమ్మె..ఎందుకు ? ఎక్కడ?




One Comment