USA vs NED : చరిత్ర సృష్టించిన యూఎస్ఏ..నెదర్లాండ్స్ కు బిగ్ షాక్
USA vs NED : యూఎస్ఏ 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది
USA vs NED
టీ ట్వంటీ ప్రపంచకప్ లో యూఎస్ఏ చరిత్ర సృష్టించింది. భారత్ పై ఆకట్టుకున్న యూఎస్ఏ తాజాగా నెదర్లాండ్స్(USA vs NED) పై సంచలన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్ లో సాయితేజ ముక్కామల , సంజాన్నే అదరగొడితే.. బౌలింగ్ లో హర్మిత్ సింగ్, షాడ్లీ డచ్ జట్టును దెబ్బకొట్టారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన యూఎస్ఏ 196 పరుగుల భారీస్కోరు సాధించింది. సాయితేజ ముక్కామల(79), రంజాన్నే(48) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లపై సాయితేజ పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. మోనాంక్ పటేల్ తో కలిసి 55, సంజయ్ కృష్ణమూర్తితో కలిసి 24 , రంజాన్నేతో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. నెదర్లాండ్స్ బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివర్లో వికెట్లు తీసినా అప్పటికే స్కోరు 190 దాటింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లీడెన్ 3 , క్లాసెన్, విన్ , బీక్ తలో వికెట్ తీశారు.

చెన్నై పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడం, మంచు ప్రభావం కూడా కనిపించడంతో నెదర్లాండ్స్ పరుగుల వరద పారిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అమెరికా బౌలర్లు సమిష్టిగా రాణించి నెదర్లాండ్స్ కు షాకిచ్చారు. స్పిన్నర్ హర్మీత్ సింగ్ చెన్నై పిచ్ కండీషన్లను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని వరుస వికెట్లు పడగొట్టాడు.
తక్కువ ఎత్తులో బంతిని తిప్పుతూ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా నెదర్లాండ్స్ పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయింది. అటు షాడ్లీ కూడా చెలరేగిపోవడంతో డచ్ జట్టు కోలుకోలేకపోయింది. కేవలం 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది,. షాట్ల ఎంపికలో తప్పిదాలు నెదర్లాండ్స్ కొంపముంచాయి. దీంతో నెదర్లండ్స్ 103 పరుగులకే కుప్పకూలింది. టీ20 క్రికెట్ లో నెదర్లాండ్స్ పై గెలవడం యూఎస్ఏకు ఇదే తొలిసారి. 4 వికెట్లు తీసిన హర్మీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ టోర్నీలో యూఎస్ఏకు (USA vs NED)ఇదే తొలి విజయం.



