ICC: ఐసీసీ చెబితే మాకేంటి ? అండర్ 19లోనూ నో షేక్ హ్యాండ్
ICC: నార్మల్ గా ఈ మ్యాచ్ లో ఆట లేదా ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య కవ్వింపు చర్యలే హాట్ టాపిక్ గా ఉంటాయి. అయితే ఈ సారి నో షేక్ హ్యాండ్ విధానంతో పాక్ క్రికెట్ జట్టుకు భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది.
ICC
ఈ ఏడాది వరల్డ్ క్రికెట్ లో అత్యంత చర్చ జరిగిన అంశం ఏదైనా ఉందంటే అది నో షేక్ హ్యాండ్ విధానమే.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఆసియాకప్ లో తలపడినప్పుడు ఈ వివాదం మొదలైంది. పహల్గాం దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం తీర్చుకున్న భారత్ , పాక్ కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఆసియాకప్ లో అసలు తలపడకూడదన్న చర్చ కూడా జరిగింది. కానీ ఐసీసీ(ICC)తో చేసుకున్న ఒప్పందం కారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు ఆసియాకప్ లో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి.
నార్మల్ గా ఈ మ్యాచ్ లో ఆట లేదా ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య కవ్వింపు చర్యలే హాట్ టాపిక్ గా ఉంటాయి. అయితే ఈ సారి నో షేక్ హ్యాండ్ విధానంతో పాక్ క్రికెట్ జట్టుకు భారత్ దిమ్మతిరిగే షాకిచ్చింది. టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తర్వాత మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత క్రికెటర్ల పాక్ ప్లేయర్స్ ను పట్టించుకోలేదు. ఒకదశలో భారత్ డ్రెస్సింగ్ రూమ్ ముందు పాక్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కోసం పడిగాపులు పడినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

దీనిపై పాక్ టీమ్ మేనేజ్ మెంట్, పీసీబీ ఛైర్మన్ నఖ్వీ నానా హంగామా చేసేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి ఐసీసీ (ICC)మహిళల వన్డే ప్రపంచకప్ లోనూ పాక్ తో మ్యాచ్ సందర్భంగా నో షేక్ హ్యాండ్ విధానానికే బీసీసీఐ కట్టుబడి ఉంది. ఐసీసీ (ICC)కూడా విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. తాజాగా అండర్ 19 ఆసియాకప్ లోనూ ఇదే రిపీటయింది.
నిజానికి ఈ టోర్నీ ఆరంభానికి ముందే భారత్ కు ఐసీసీ నో షేక్ హ్యాండ్ వివాదానికి స్వస్తి పలికి కరచాలనం చేసుకోవాలని సూచించింది. బీసీసీఐ మాత్రం అధికారికంగా స్పందించలేదు. తాజాగా ఆదివారం పాక్ తో మ్యాచ్ లో మాత్రం నో షేక్ హ్యాండ్ కే కట్టుబడి ఉంది. ఐసీసీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినా వెనక్కి తగ్గలేదు. భారత అండర్ 19 కెప్టెన్ ఆయుశ్ మాత్రే పాక్ కెప్టెన్ తో కరచాలనం చేయలేదు.
దీనిపై ఐసీసీ అధికారులు కూడా స్పందించారు. అండర్ 19 క్రికెట్ లో రాజకీయ పరమైన అంశాలకు చోటు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే తాము బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. నిజానికి ప్రత్యర్థి ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వకుంటే మ్యాచ్ రిఫరీకి ముందే తెలియజేయాల్సి ఉంటుంది.



