Just SportsLatest News

4th T20I: భారత్ జోరు కొనసాగుతుందా? ఆసీస్‌తో నాలుగో టీ ట్వంటీపై పెరుగుతున్న క్యూరియాసిటీ

4th T20I: గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, బ్యాటింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్లు ఆడకున్నా, కీలకమైన భాగస్వామ్యాలతో సత్తా చాటారు.

4th T20I

భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో నాలుగో టీ ట్వంటీ(4th T20I) గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగబోతోంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత రెండు జట్లూ చెరొక మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది సిరీస్ చేజిక్కించుకోవాలన్నా లేక చేజారకుండా ఉండాలన్నా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మూడో టీ ట్వంటీలో కంగారూలను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది.

గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. టాపార్డర్ బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడకున్నా, కీలకమైన భాగస్వామ్యాలతో సత్తా చాటారు. బౌలింగ్ అవకాశం రాకపోవడంతో వాషింగ్టన్ సుందర్ బ్యాట్ తో రెచ్చిపోయాడు. వరల్డ్ కప్‌కు జట్టు కూర్పుపై ఫోకస్ ఉండటంతో తన ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

అతనితో పాటు తిలక్ వర్మ, జితేశ్ శర్మ కూడా రాణించారు. ఫలితంగా సిరీస్ ను సమం చేయడంలో భారత్ సక్సెస్ అయింది. ఇప్పుడు అదే జోరు కొనసాగించి ఆధిక్యంలో నిలవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్ అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ మెరుపు ఆరంభాన్నిస్తే మాత్రం తిరుగుండదు.

4th T20I
4th T20I

అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కలవరపెడుతోంది. టీ20 (T20I)జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత సూర్య పెద్దగా రాణించడం లేదు. వరల్డ్ కప్‌కు ముందు జరిగే ప్రతీ సిరీస్లో లో ప్రతీ ప్లేయర్ ఫామ్ నిరూపించుకోవాల్సిందే. దీంతో ఆసీస్ టూర్లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండడంతో సూర్య కుమార్ ఫామ్లోకి వస్తాడో లేదో చూడాలి. అటు బౌలింగ్ లో అర్షదీప్  సింగ్  తన ప్రాధాన్యతను నిరూపించుకున్నాడు. హర్షిత్ రాణాను పక్కన పెట్టి మూడో టీట్వంటీలోకి అవకాశమివ్వగా పవర్ ప్లేలోనే 2 కీలక వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. అలాగే స్పిన్నర్లు కూడా పర్వాలేడనిపిస్తున్నా గత మ్యాచ్లో టిమ్ డేవిడ్, స్టోయినిస్ కు కట్టడి చేయలేకపోయారు. కాగా భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ సాధిస్తే మాత్రం ఎవరి స్థానంలో తీసుకుంటారనేది చూడాలి. మరోవైపు మూడో టీ20లో బ్యాటర్ల వైఫల్యమే ఆసీస్ ఓటమికి కారణమైంది. టిమ్ డేవిడ్, స్టోయినిస్ ఆడుకోకుంటే ఆసీస్ ఇంకా తక్కువ స్కోరుకే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ జట్టులోకి రావడం కంగారూల బలాన్ని పెంచింది. గాయంతో తొలి మూడు మ్యాచ్లకు మాక్సీ దూరమయ్యాడు. పేస్ ఎటాక్‌ల డ్వార్సియస్, బియర్డ్మన్ లో ఒకరికి చోటు దక్కనుంది.
ఇక వాతావరణం పరంగా చూస్తే నాలుగో టీ20కి వర్షం ముప్పు లేదు. గోల్డ్ కోస్ట్ పిచ్ సహజంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు కాస్త సహకరించినా తర్వాత బ్యాటర్ల ఆధిపత్యం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గుచూపొచ్చు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button