AI Agents: ఏఐ ఏజెంట్స్ .. మీ పనులు అవే పూర్తి చేసే రోజులు వచ్చేశాయి!
AI Agents: ఇప్పటివరకు మనం వాడుతున్న చాట్ జీపీటీ, జెమినీ ఏఐ వంటివి కేవలం మనం అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇస్తున్నాయి.
AI Agents
వ్యాపార ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు మనం వాడుతున్న చాట్ జీపీటీ, జెమినీ ఏఐ వంటివి కేవలం మనం అడిగిన ప్రశ్నలకు సమాచారం ఇస్తున్నాయి. కానీ 2026లో రాబోతున్న ‘ఏఐ ఏజెంట్స్-AI Agentsసమాచారంతో ఆగవు, నేరుగా పనులనే పూర్తి చేసేస్తాయి.
ఉదాహరణకు, మీరు ఒక బిజినెస్ మీటింగ్ కోసమో, మరేదో పని కోసమే వేరే ఊరు వెళ్లాలనుకుంటే, మీ ఏఐ ఏజెంట్(AI Agents) మీ మెయిల్స్ చెక్ చేసి, మీ క్యాలెండర్ ప్రకారం ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేస్తుంది. అంతేకాదు మీకు ఇష్టమైన హోటల్లో గదిని కూడా అదే రిజర్వ్ చేస్తుంది.
ఈ మార్పు వ్యాపార రంగంలో పెను విప్లవాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తో పాటు స్టార్టప్‌లకు ఇది ఒక వరప్రసాదం కానుంది. తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ ఫలితాలను సాధించడానికి ఏఐ ఏజెంట్లు వీరి సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ రంగంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇప్పుడు గొప్ప అవకాశాలు ఉన్నాయి. వివిధ రంగాలకు అంటే మెడికల్, లీగల్ లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటికి ప్రత్యేకంగా పని చేసే ఏఐ ఏజెంట్లను తయారు చేయడం ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారుతుంది.

దీంతో కేవలం టెక్నాలజీ తెలిసిన వారికే కాదు, ఒక నిర్దిష్ట రంగంపై అవగాహన ఉన్న ఎవరైనా సరే ఇకపై ఏఐ డెవలపర్ల సహాయంతో తమ స్వంత ఏజెంట్లను రూపొందించొచ్చు.
దీనివల్ల 2026లో అలాగే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి ఒక పర్సనల్ ఏఐ ఏజెంట్ ఉండే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ వల్ల ప్రొడక్టవిటీ 10 రెట్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విప్లవంలో ముందు వరుసలో ఉన్నవారు రాబోయే దశాబ్ద కాలం పాటు బిజినెస్ లీడర్లుగా ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు.



