AI Robots:ఇంటి పనులకు ఇక ఏఐ రోబోలు..ఏమేం పనులు చేస్తాయో తెలుసా?
AI Robots: ఫ్రిజ్‌లో ఏ వస్తువులు అయిపోయాయో ముందే చూసి మనకు అలర్ట్స్ పంపడమే కాదు ఏకంగా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వంటివి కూడా చేస్తాయి.
AI Robots
మనం ఇప్పటి వరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన రోబోలు.. ఇప్పుడు 2026లో మన నిజ జీవితంలోకి అది కూడా మన వంటింట్లోకి వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఏఐ ఆధారిత హోమ్ రోబోలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
కేవలం ఇల్లు ఊడ్చడం, తుడవడమే కాకుండా మనతో మాటలు కలుపుతూ.. మనకు ఇష్టమైన వంటలు చేసే స్థాయికి ఈ టెక్నాలజీ ఎదిగిపోయింది. బిజీగా ఉండే ఉద్యోగస్తులకు, ఒంటరిగా ఉండే వృద్ధులకు ఈ ఏఐ రోబోలు(AI Robots) ఒక కుటుంబ సభ్యుడిలా తోడుగా ఉండబోతున్నాయి.
ఈ ఏడాది మార్కెట్లోకి వస్తున్న అధునాతన ఏఐ రోబోలు(AI Robots).. మన ఇంటి వాతావరణాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటాయి. ఉదాహరణకు, నేల మీద పడిన చెత్తను గుర్తించి అది ఏ రకమైన చెత్త అని సెపరేట్ చేసి మరీ శుభ్రం చేస్తాయి. అంతేకాదు.. ఫ్రిజ్‌లో ఏ వస్తువులు అయిపోయాయో ముందే చూసి మనకు అలర్ట్స్ పంపడమే కాదు ఏకంగా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వంటివి కూడా చేస్తాయి.
వంటగదిలో కూడా ఈ రోబోలు బాగా సాయం చేస్తాయి. మనం చెప్పిన రెసిపీని బట్టి కూరగాయలు కోయడం, గిన్నెలు కడగడం వంటి పనులను ఇవి ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తాయి. దీనివల్ల చాలామందికి శారీరక శ్రమ తగ్గడమే కాకుండా, తమ కోసం కేటాయించుకునే సమయం వారికి పెరుగుతుంది.

అంతేకాకుండా భద్రత విషయంలో కూడా ఈ రోబోలు కీలక పాత్రే పోషిస్తాయి. ఇంట్లో గ్యాస్ లీక్ అయినా , అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే లోపలికి రావడానికి ప్రయత్నించినా కూడా ఇవి వెంటనే సెన్సార్ల ద్వారా గుర్తించి మన ఫోన్‌కు మెసేజ్ పంపుతాయి.
ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు , వృద్ధులు ఉన్నప్పుడు, వారు కింద పడిపోయినపుడు లేదా వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినపుడు ఈ రోబోలు వెంటనే ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసేలా ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, మన ఇంటికి ఒక కాపలాదారుడిగా కూడా పనిచేస్తుంది.
అయితే ఈ రోబోల ధరలు ప్రస్తుతం కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా, రానున్న రోజుల్లో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. టెక్నాలజీ పెరిగేకొద్దీ వీటి పరిమాణం తగ్గి, పనితీరు మరింత మెరుగవనుంది. మన మాటను విని, మన భావాలను అర్థం చేసుకునే ఈ ఏఐ రోబోలు రాబోయే కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఒక భాగం కానున్నాయి. దీంతో ఇంటి పని ఒక యంత్రం సహాయంతో ఈజీగా ముగించుకునే సరికొత్త లైఫ్ స్టైల్‌కి మనం సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది.
Dream:మీ కలలకు మీరే బాస్..అవును మీ డ్రీమ్‌ను మీరు డిసైడ్ చేయొచ్చట..



