Amazon Layoffs: 30 వేల మంది ఉద్యోగాలు ఫట్..  అమెజాన్ భారీ కోతకు కారణమిదే

Amazon Layoffs: ఏఐ కారణంగా కోతలు ఉంటాయని గత జూన్ లోనే అమెజాన్ యాజమాన్యం స్పష్టం చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు భారీస్థాయిలో తొలగింపులు చేస్తున్నట్టు అర్థమవుతోంది.

Amazon Layoffs

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో లక్షలాది మంది ఉద్యోగాలకు ముప్పు(Amazon Layoffs) వాటిల్లితోంది. గత కొన్ని నెలలుగా ఊహించినట్టుగానే ఏఐ వినియోగం కోసం సిద్ధమవుతున్న పలు దిగ్గజ కంపెనీలు భారీగా లే ఆఫ్స్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ఏకంగా 30 వేల మందిని ఇంటికి పంపించబోతోంది.

కరోనా సమయంలో భారీగా డిమాండ్ నెలకొనడంతో చాలా మందిని తీసుకుంది. ఇప్పుడు ఖర్ఛు తగ్గింపులో భాగంగా వారందరికీ గుడ్ బై చెబుతోంది. ప్రస్తుతం అమెజాన్ కు ప్రపంచ వ్యాప్తంగా 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో కనీసం 10 శాతం మందికి పింక్ స్లిప్స్ అందబోతున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గతంలో 27వేల మందిని దఫదఫాలుగా తొలగించిన అమెజాన్ ఇప్పుడు కూడా దానికి సమాన స్థాయిలో ఉద్యోగులను తీసేయాలని(Amazon Layoffs) నిర్ణయించింది.

గత రెండేళ్ళుగా పలు విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకుంటూ వచ్చింది. డివైజెస్, పాడ్ క్యాస్టింగ్, కమ్యూనికేషన్ వంటి డిపార్ట్ మెంట్స్ లో కోత పెట్టింది. దానితో పాటు ఆపరేషన్స్, వెబ్ సర్వీసెస్ లోనూ తగ్గించేసింది.

Amazon Layoffs

కంపెనీ అభివృద్ధి నిర్ణయాల్లో భాగంగానే ఈ కోతలు జరుగుతున్నట్టు సీఈవో చెబుతున్నా ఏఐ ప్రభావమేనని తేలిపోయింది. ఏఐ కారణంగా కోతలు ఉంటాయని గత జూన్ లోనే అమెజాన్ యాజమాన్యం స్పష్టం చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు భారీస్థాయిలో తొలగింపులు చేస్తున్నట్టు అర్థమవుతోంది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారిని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినట్టు, ఈ మేరకు అంతర్గతంగా మెయిల్స్ వెళ్ళినట్టు సమాచారం. అలాగే వారి పనితీరు, అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సెటిల్మెంట్ చేయనున్నారు.

కాగా అమెజాన్ సీఈవోగా ఆండీ జాస్సీ వచ్చిన తర్వాత లే ఆఫ్స్ మరింత ఎక్కువయ్యాయి. ఏఐ వినియోగం విషయంలో ఆయన ఎక్కువగా దృష్టి పెట్టడంతోనే ఉద్యోగాల కోత పెరుగుతూ వస్తోందని పలువురు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఉద్యోగాల కోత జరిగినా ఈ స్థాయిలో లే ఆఫ్స్ ఇవ్వనుండడం ఇదే తొలిసారి. 2023 మార్చిలో 9000, జూన్ లో 18,000 మందిని వరకూ ఉద్యోగులను అమెజాన్ సాగనంపింది. ఇప్పుడు అంతకుమించి పింక్ స్లిప్స్ ఇస్తుండడంతో కార్పొరేట్ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లే ఆఫ్స్ గా మిగిలిపోనుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version