Just TechnologyLatest News

Cars: బడ్జెట్ ఫ్రెండ్లీ కారులలో బెస్ట్ ఆప్షన్స్ ..మీ కల నిజమయ్యే టైమ్ ఇదే!

Cars: కేవలం రూ. 5 లక్షల లోపు ధరలో, అద్భుతమైన ఫీచర్స్, స్టైల్, బెస్ట్ మైలేజ్తో లభించే కార్లు ఇప్పుడు టాప్ లేపుతున్నాయి.

Cars

లక్షలు పోసి ఖరీదైన కార్లు కొనడం అనేది ఒక ట్రెండ్ కావచ్చు, కానీ అందరికీ అది సాధ్యం కాదు. అలాంటి వాళ్ల కోసమే ఇప్పుడు మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ కార్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న కుటుంబాలకు, అలాగే సిటీలో ఈజీగా జర్నీ చేయించాలనుకునేవారికి ఈ కార్లు బెస్ట్ ఆప్షన్స్. కేవలం రూ. 5 లక్షల లోపు ధరలో, అద్భుతమైన ఫీచర్స్, స్టైల్, బెస్ట్ మైలేజ్తో లభించే కార్లు(Cars) ఇప్పుడు టాప్ లేపుతున్నాయి..

మీ పర్సనాలిటీకి, మీ ఫ్యామిలీకి సరిపోయే పర్‌ఫెక్ట్ కార్‌ను ఎంచుకోవడం అంత కష్టం కాదు. తక్కువ ధరలో ఎక్కువ వాల్యూ ఇచ్చే ఈ టాప్ కార్లు మీ డ్రైవింగ్ జర్నీని మరింత స్పెషల్ చేస్తాయి. మరి ఆ సూపర్-స్మార్ట్ ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం రండి.

మారుతి సుజుకి ఆల్టో K10:
మిమ్మల్ని నిరాశపరచని కారు ఏదైనా ఉందంటే అది ఆల్టో K10. ఇది ఒక లీటర్ K-సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో కూడా ఎంచక్కా దూసుకుపోతుంది. ఇక దీని కాంపాక్ట్ సైజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎక్కడైనా ఈజీగా పార్క్ చేయొచ్చు. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలవుతుంది. మైలేజీ గురించి అయితే మారుతీ బ్రాండ్(Cars) మీద నమ్మకం పెట్టుకోవచ్చు. ఒక లీటర్‌కు 24.39 కి.మీ ఇస్తుంది.

cars
cars

టాటా టియాగో:
మీ బడ్జెట్‌ను కొంచెం పెంచగలిగితే, టాటా టియాగో బేస్ వేరియంట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. టాటా అంటేనే క్వాలిటీ, సేఫ్టీకి పెట్టింది పేరు. ఈ కారు 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో వస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టైల్‌కు, సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈ కారు పర్ఫెక్ట్.

మారుతి సుజుకి S-ప్రెస్సో:
దీన్ని మినీ ఎస్‌యూవీగా పిలవొచ్చు. దీని పొడవైన, బోల్డ్ డిజైన్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. దీని క్యాబిన్‌లో కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది. స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. దీని ధర రూ. 4.26 లక్షల నుంచి మొదలవుతుంది. మైలేజ్ అయితే దీనిలో అదిరిపోతుంది. ఒక లీటర్‌కు 32.7 కి.మీ మైలేజీ ఇస్తుంది.

రెనాల్ట్ క్విడ్:
యూత్‌ను దృష్టిలో పెట్టుకొని రెనాల్ట్ క్విడ్‌ను డిజైన్ చేశారు. దీని ఎస్‌యూవీ లాంటి స్టాన్స్, 279 లీటర్ల బూట్ స్పేస్ దీనిని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ డీఆర్ఎల్ వంటి ఫీచర్లు ఈ తక్కువ ధర కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. దీని ధర రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి సెలెరియో:
ఈ కారు బేస్ ధర రూ. 5 లక్షల కంటే ఎక్కువగానే ఉన్నా కూడా , పండుగ ఆఫర్లతో, డిస్కౌంట్లతో ఈ కారును రూ. 5 లక్షల లోపే పొందొచ్చు. ఇందులో కూడా ఆల్టో K10 లాంటి K-సిరీస్ ఇంజిన్ ఉంది. ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రాక్టికల్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ ఈ కారుకు అదనపు ఆకర్షణ. ఇక ఇందులో ఉన్న హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.

మొత్తానికి, మీ బడ్జెట్ ఎంత ఉన్నా, మీ అవసరానికి తగ్గ ఒక కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. పై కార్ల(Cars)లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని, మీ కలల జర్నీని స్టార్ట్ చేయొచ్చు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button