Phone Remember: ఫోన్ మనల్ని గుర్తు పెట్టుకుంటుందా? మీ వ్యక్తిగత రహస్యాలను టెక్నాలజీ గమనిస్తుందా?
Phone Remember: మనం ఒక వ్యక్తితో మనసు విప్పి మాట్లాడుకునే మాటలు కూడా ఎక్కడో ఒక సర్వర్‌లో నిక్షిప్తం అవుతున్నాయి.
Phone Remember
ప్రస్తుత కాలంలో మన జీవితం ఫోన్ అనే ఒక చిన్న యంత్రం చుట్టూనే తిరుగుతోంది. నిజానికి మనం ఫోన్‌ను వాడుతున్నామా లేక ఫోన్ మనల్ని వాడుకుంటోందా అంటే కచ్చితంగా ఫోన్ మనల్ని గమనిస్తోందనే(Phone Remember) చెప్పాలి.
మనకు తెలియకుండానే మన ప్రతి కదలిక, మన మాటలు, మన ఇష్టాలు డేటా రూపంలో రికార్డ్ (Phone Remember)అవుతున్నాయి. ఉదాహరణకు మీరు ఒక స్నేహితుడితో కలిసి ఏదైనా కార్ గురించి గానీ లేదా కొత్త మొబైల్ గురించి గానీ మాట్లాడుకున్నారు అనుకోండి, మీరు ఫోన్ తీయగానే దానికి సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
ఇది యాదృచ్ఛికం కాదు.
మన ఫోన్ మైక్రోఫోన్, లొకేషన్ , మనం వెతికే విషయాల ద్వారా మన గురించి ఒక డిజిటల్ ప్రొఫైల్ తయారు చేసుకుంటుంది. మనం ఏ సమయంలో ఏం చేస్తాం, ఏ వస్తువులను ఇష్టపడతాం అనే విషయాలు మనకంటే ఫోన్‌కే బాగా తెలుసు.

దీనివల్ల మన ప్రైవసీ అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మనం ఒక వ్యక్తితో మనసు విప్పి మాట్లాడుకునే మాటలు కూడా ఎక్కడో ఒక సర్వర్‌లో నిక్షిప్తం అవుతున్నాయి.
టెక్నాలజీ మన జ్ఞాపకశక్తిని కూడా మెల్లగా దెబ్బతీస్తోంది. ఒకప్పుడు మనకు వందల కొద్దీ ఫోన్ నెంబర్లు గుర్తుండేవి, దారులు గుర్తుండేవి. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఫోన్ మీద ఆధారపడుతున్నాం.
గూగుల్ మ్యాప్స్ లేకపోతే పక్క వీధిలోకి వెళ్లడం కూడా కష్టమవుతోంది. మన మెదడు కొత్త విషయాలను గుర్తుపెట్టుకోవడం మానేసి, “ఫోన్ ఉందిగా అది చూసుకుంటుంది” అనే బద్ధకానికి అలవాటు పడిపోతోంది.
దీనినే శాస్త్రవేత్తలు ‘డిజిటల్ డిమెన్షియా’ అని పిలుస్తున్నారు. మన జ్ఞాపకాలు ఫోన్ గ్యాలరీలో పెరుగుతున్నాయి కానీ మన మెదడులో మాత్రం అవి మసకబారిపోతున్నాయి. ఫోన్ మనకు పాత ఫోటోలు చూపిస్తూ జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది కానీ, ఆ క్షణంలో మనం అనుభవించిన ఫీలింగ్ కంటే స్క్రీన్ మీదున్న ఇమేజ్ కే ప్రాధాన్యత ఇస్తున్నాం.
మన జీవితం మొత్తం ఒక అల్గోరిథం ద్వారా నడపబడుతోంది. మనం ఏం చూడాలి, ఏం తినాలి, ఎక్కడ తిరగాలి అనేది కూడా టెక్నాలజీ నిర్ణయిస్తోంది. కాబట్టి మనం ఫోన్‌కు యజమానిగా ఉండాలి తప్ప అది మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లనివ్వకూడదు.



