Google AI: ఇంటర్నెట్ లేకుండానే AI యాప్ .. గూగుల్ క్రేజీ ప్రయోగం
Google AI : డేటా లేకుండా పని చేసే AI యాప్ .. టెక్ ప్రపంచంలో సంచలనం తీసుకొచ్చిన గూగుల్.

Google AI
టెక్ దిగ్గజం గూగుల్ (google) మరోసారి తన సాంకేతిక నైపుణ్యాన్ని చాటుతూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఏ యాప్‌ను ఉపయోగించాలన్నా ఫోన్లో డేటా లేదా వైఫై అవసరం అనేది తెలిసిందే. కానీ ఇప్పుడు గూగుల్ తీసుకువచ్చిన కొత్తగా AI ఎడ్జ్ గ్యాలరీ (AI Edge Gallery)అనే యాప్ ఇందుకు పూర్తి భిన్నంగా నిలిచింది. రోజురోజుకూ మారుతున్న ఏఐ ప్రపంచంలో వినియోగదారులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందించేందుకు ఈ యాప్ రూపొందించారు. ప్రత్యేకత ఏమిటంటే… ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఏఐ మోడల్స్‌ను ఉపయోగించుకోగలుగుతారు. అంటే ఫోన్లో డేటా(data) కనెక్షన్ లేకపోయినా కూడా ఇమేజ్ క్రియేషన్(image creation), కోడింగ్(coding), ప్రశ్నలకు సమాధానాలు వంటి పనులను ఈ యాప్ ద్వారా చేయొచ్చు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… యూజర్ల డేటా ఎక్కడికీ వెళ్లదు. డేటా పూర్తిగా ఫోన్ లోనే ప్రాసెస్ అవుతుంది. దీని వల్ల ప్రైవసీ సమస్యలు(user privacy AI) తలెత్తే అవకాశమే లేదు. అంతేగాక… ఫలితాలు వేగంగా కూడా లభిస్తాయి. క్లౌడ్ సర్వర్ల (cloud server) కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఫోన్లోని బ్యాకెండ్లోనే మోడల్ రన్ అవుతూ త్వరితగతిన స్పందిస్తుంది. సెక్యూరిటీ పరంగా ఇది చాలా అడ్వాన్స్డ్ లెవెల్ మోడల్‌గా నిలుస్తోంది.
GOOGLE AI

ఈ గూగుల్ ఏఐ (google AI) ఎడ్జ్ గ్యాలరీ యాప్ ప్రధానంగా గెమ్మా 31బీ(Gemma 31B) అనే మోడల్‌పై ఆధారపడి పనిచేస్తోంది. కేవలం 529MB పరిమాణంతో వచ్చిన ఈ మోడల్ చిన్నదైనా పనితీరులో మాత్రం శక్తివంతంగా ఉంటుంది. ఇది ఓపెన్ సోర్స్(open source)లో అపాచీ 2.0 లైసెన్స్‌తో విడుదలయ్యింది. విద్యార్థుల నుంచీ, వాణిజ్య రంగాల దాకా ఎవరికైనా ఉపయోగపడేలా డిజైన్ చేశారు. గెమ్మా 31బీ మోడల్ ఒక్క సెకనులో సుమారు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. భారీ టెక్స్ట్ కంటెంట్‌ను తక్కువ సమయంలో జనరేట్ చేయగలదు. డాక్యుమెంట్ల విశ్లేషణ, కంటెంట్ సృష్టించడం, స్మార్ట్ రిప్లయ్‌లను ఇవ్వడం లాంటి పనుల్లో ఇది విశేషంగా పనిచేస్తుంది.
ప్రస్తుతం ఈ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ కొంతమందికి ఓపెన్ సోర్స్ రూపంలో అందుబాటులో ఉంది. ఇక త్వరలోనే ఐఓఎస్ యూజర్ల కోసం కూడా ఈ యాప్‌ను విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. డేటా లేకున్నా ఏఐ సేవలు అందుబాటులోకి రావడం అనేది టెక్ ప్రపంచంలో మరో పెద్ద అడుగు అని చెప్పొచ్చు.
Also Read: Apricots : డ్రై ఆప్రికాట్లు 2 తింటే చాలట.. కావాల్సినన్ని లాభాలు
One Comment