Just Science and TechnologyJust NationalLatest News

Rupee:మన రూపాయి ప్రయాణం.. వెండి నాణెం నుండి డిజిటల్ కరెన్సీ వరకు ఎలా సాగింది..

Rupee: క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే మగధ సామ్రాజ్యం ఈ రూపాయి నాణేలను చలామణిలోకి తెచ్చిందట.

Rupee

ఇప్పుడంటే డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు పడ్డాం కానీ ఒకప్పుడు నోట్లు, కాయిన్లు జేబులోనో, పర్సులోనే లేకుండా బయటకు కదిలే పరిస్థితి ఉండేది కాదు. అయితే ఎక్కువగా రూపాయి నాణేలు ప్రతీ ఒక్కరి దగ్గరా ఉండేవి. నిజానికి మన భారతీయ రూపాయి చరిత్ర సుమారు 2500 ఏళ్ల క్రితమే మొదలైందట. రూప్యకం అనే సంస్కృత పదం నుంచి రూపాయి అనే పేరు వచ్చింది.. నచ్చీ చెక్కిన వెండి నాణెం అని దీని అర్థం .

క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే మగధ సామ్రాజ్యం ఈ నాణేలను చలామణిలోకి తెచ్చిందట. అయితే, ఆధునిక రూపాయికి మాత్రం పునాది వేసింది 16వ శతాబ్దంలో షేర్ షా సూరి. ఆయన ప్రవేశపెట్టిన 178 గ్రెయిన్ల బరువున్న వెండి నాణేన్ని రూపియా అని పిలిచేవారట. అప్పట్లో ఒక రూపాయి అంటే 16 అణాలుగా విభజించబడి ఉండేదట. ఆ తర్వాత మొఘలులు, బ్రిటిష్ వారు వచ్చాక ఈ రూపాయిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.

1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1957లో మనం డెసిమల్ పద్ధతిని స్వీకరించి రూపాయిని రూపం మార్చారు. అంటే ఒక రూపాయిని 100 పైసలుగా మార్చారు. ఆ తర్వాత 1996 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ సిరీస్‌తో రూపాయి నోట్లను ప్రవేశపెట్టింది. అప్పటి వరకు రూపాయిని కేవలం Rs లేదా Re అని పిలిచేవాళ్లు. అయితే 2010లో మన కరెన్సీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

Rupee
Rupee

ఇంకా చెప్పాలంటే 2010 జూలై 15న మన రూపాయికి (₹)అనే కొత్త గుర్తు లభించింది. ఐఐటీ బాంబే ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ధర్మలింగం దీనిని రూపొందించారు. నిజానికి ఈ గుర్తు వెనుక చాలా లోతైన అర్థం ఉంది. ఈ గుర్తు దేవనాగరి లిపిలోని ‘ర’ (Ra) , రోమన్ అక్షరం ‘R’ ల కలయికగా చెబుతారు
ఇందులో పైన ఉన్న రెండు అడ్డగీతలు భారత జాతీయ జెండాలోని త్రివర్ణ పతాకాన్ని సూచిస్తాయట. అందులో ఉన్న ఆ గీతలు ‘సమానత్వం’ (=) గుర్తును పోలి ఉండి, మన దేశ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లు అర్దం.

అయితే ప్రస్తుతం ఈ రూపాయి కేవలం కాగితానికి, నాణేనికే పరిమితం కాలేదు. ‘ఇ-రూపీ’ (Digital Rupee) రూపంలో డిజిటల్ ప్రయాణాన్ని కూడా స్టార్ట్ చేసింది. మన రూపాయి విలువ అంతర్జాతీయంగా పెరుగుతూ, ఈరోజు ఎన్నో దేశాలు రూపాయిలోనే వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని గుర్తుపెట్టుకోవాలి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button