Just SportsLatest News

Nepal : చరిత్ర సృష్టించిన నేపాల్…వరల్డ్ కప్ లో తొలి విజయం

Nepal : నేపాల్ క్రికెట్ చరిత్రలో ఈ టీ20 ప్రపంచకప్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన నేపాల్ మెగాటోర్నీలో తొలి విజయాన్ని రుచి చూసింది.

Nepal

నేపాల్ క్రికెట్ చరిత్రలో ఈ టీ20 ప్రపంచకప్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన నేపాల్(Nepal) మెగాటోర్నీలో తొలి విజయాన్ని రుచి చూసింది. తమ చివరి మ్యాచ్ లో స్కాట్లాండ్ పై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు జార్జ్ మున్సే, మైకేల్ జోన్స్ దుమ్మురేపారు.

తొలి వికెట్ కు 10 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ స్కాట్లాండ్ 200కు పైగా స్కోర్ చేస్తుందనుకున్నారు. జార్జ్ 27 రన్స్ కు ఔటవగా.. మెక్ ములన్ 25 పరుగులు చేశాడు. తర్వాత మరింత ధాటిగా ఆడే క్రమంలో జోన్స్ 71 పరుగులకు ఔటయ్యాడు. ఇక్కడ నుంచి నేపాల్(Nepal) బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లు ఇవ్వకుండా కట్టడి చేసి తక్కువ స్కోరుకే స్కాట్లాండ్ ను పరిమితం చేశారు. ఒక దశలో 200 పైగా చేస్తుందనుకుంటే… చివరికి నేపాల్ బౌలర్లు బౌన్స్ బ్యాక్ అవ్వడంతో 20 ఓవర్లలో 170 పరుగులే చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమి 3, నందన్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

Nepal
Nepal

ఛేజింగ్ లో నేపాల్ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓపెనర్లు కుశాల్, ఆసిఫ్ షేక్ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. కుశాల్ 35 బంతుల్లో 4 సిక్సర్లు,1 ఫోర్ తో 45 , ఆసిఫ్ షేక్ 27 బంతుల్లో 33 పరుగులకు ఔటైనప్పటకీ.. తర్వాత దీపేంద్రసింగ్ , గుల్షన్ ఝా కీలక భాగస్వామ్యంతో జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

ఈ క్రమంలో దీపేంద్రసింగ్ చివర్లో విక్సర్లతో నిరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో నేపాల్ మరో 4 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్ లో తొలి విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button