Satellite Internet: మొబైల్ టవర్లు లేని అడవుల్లో కూడా 5జీ స్పీడ్ ..ఎలా సాధ్యం?
Satellite Internet: తుపానులు , ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొబైల్ టవర్లు కూలిపోయినా సరే శాటిలైట్ ఇంటర్నెట్ మాత్రం ఆగదు.
Satellite Internet
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది గాలి, నీరు లాగే ఒక మెయిన్ అవసరంగా మారిపోయింది. కానీ ఇప్పటికీ మన దేశంలోని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు , దట్టమైన అడవులలో నెట్వర్క్ సమస్యలు విపరీతంగా కనిపిస్తుంటాయి. ఫోన్ సిగ్నల్ దొరకక చెట్లు,హైట్ ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఎక్కే దృశ్యాలను మనం చూస్తూనే ఉన్నాం.
ఈ సమస్యలకు పర్మినెంట్ పరిష్కారంగా ‘శాటిలైట్ ఇంటర్నెట్'(Satellite Internet) రాబోతోంది. సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ సముద్రాల కింద ఉండే కేబుల్స్ కానీ ఊళ్లల్లో ఉండే మొబైల్ టవర్ల ద్వారా కానీ వస్తుంది. కానీ శాటిలైట్ ఇంటర్నెట్ నేరుగా అంతరిక్షం నుంచే వస్తుంది.
ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ (Starlink) సంస్థ భూమికి అతి దగ్గరగా ఉండే కక్ష్యలో దీనికోసం ఇప్పటికే వేలాది చిన్న ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఇవి కంటెన్యూగా భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి అంగుళానికి ఇంటర్నెట్ సిగ్నల్స్ ను అందిస్తాయి. దీనివల్ల మీరు ఎడారిలో ఉన్నా, సముద్రం మధ్యలో ఉన్నా కూడా హైస్పీడ్ 5జీ (5G speed)ఇంటర్నెట్ను ఎంచక్కా వాడుకోవచ్చు.

ఈ టెక్నాలజీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇంటర్నెట్(Satellite Internet) సర్వీస్‌లో ఎటువంటి అంతరాయం ఉండదు. తుపానులు , ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొబైల్ టవర్లు కూలిపోయినా సరే శాటిలైట్ ఇంటర్నెట్ మాత్రం ఆగదు.
ఇది అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ రాబోతోంది. దీనివల్ల అసలు సిగ్నల్ లేని చోట కూడా మనం మెసేజ్‌లు పంపవచ్చు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు.
అయితే, దీనివల్ల అంతరిక్షంలో వ్యర్థాలు (Space Debris) పెరగడం , ఆకాశాన్ని పరిశీలించే ఖగోళ శాస్త్రవేత్తలకు ఇబ్బందులు కలగడం వంటి కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయట. ఏది ఏమైనా, 2026 నాటికి శాటిలైట్ ఇంటర్నెట్(Satellite Internet) భారత్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, మారుమూల గ్రామాల్లో కూడా ఐటీ విప్లవం రావడం గ్యారంటీ. టవర్ల అవసరం లేని సరికొత్త ఇంటర్నెట్ యుగం మన కళ్లముందే మొదలవ్వడం ఖాయం.



