Just TechnologyLatest News

Apple CEO:యాపిల్ సీఈవో రేసులో టిమ్ కుక్.. వారసత్వంపై టెక్ ప్రపంచంలో ఉత్కంఠ!

Apple CEO: ప్రస్తుత సారథి టిమ్‌ కుక్ (Tim Cook) త్వరలోనే 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతుండటంతో, ఆయన వారసుడి అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Apple CEO

Apple CEO ప్రపంచంలోనే అగ్రగామి టెక్ కంపెనీ అయిన యాపిల్ (Apple) తదుపరి సీఈవో (CEO) ఎవరు కాబోతున్నారనే అంశం కొంతకాలంగా టెక్ సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత సారథి టిమ్‌ కుక్ (Tim Cook) త్వరలోనే 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతుండటంతో, ఆయన వారసుడి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కీలకమైన వారసత్వ రేసులో, యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అయిన జాన్ టర్నస్ (John Ternus) పేరు అత్యంత ప్రముఖంగా వినిపిస్తోంది.

జాన్ టర్నస్‌కు యాపిల్ సంస్థతో సుమారు 24 ఏళ్లుగా సుదీర్ఘ అనుబంధం ఉంది. ప్రస్తుతం ఆయన వయసు కేవలం 50 ఏళ్లు కావడం, ఈ రేసులో ఆయనకు అతిపెద్ద సానుకూల అంశం. (ఆసక్తికరంగా, 2011లో టిమ్ కుక్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన వయసు కూడా సరిగ్గా 50 సంవత్సరాలే.) టర్నస్ కేవలం హార్డ్‌వేర్ బాధ్యతలకే పరిమితం కాలేదు.

Apple CEO
Apple CEO

యాపిల్(Apple CEO) సంస్థ యొక్క కీలక నిర్ణయాలు తీసుకునే అతి కొద్దిమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆయన ఒకరు. ఇటీవల లండన్‌లో జరిగిన ఐఫోన్ 17 ఈవెంట్‌‌లో, ఐఫోన్ ఎయిర్‌ను ఆయనే స్వయంగా పరిచయం చేయడం ఆయన ప్రాధాన్యతను చాటింది. ప్రస్తుతం యాపిల్‌లో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో చాలా మంది రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నారు. టర్నస్ మధ్య వయస్కుడు కావడం వల్ల, సుదీర్ఘ కాలం పాటు నాయకత్వం వహించడానికి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా, కంపెనీలోని ఇతర ఉన్నతాధికారులతో పాటు, స్వయంగా టిమ్ కుక్ దగ్గర కూడా టర్నస్‌కు అత్యుత్తమ విశ్వసనీయత ఉంది.

యాపిల్(Apple CEO) ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే, కంపెనీ సీవోవోగా ఉన్న సబిహ్ ఖాన్ లేదా రిటైల్ హెడ్ డీర్డ్రే ఓబ్రియిన్ వంటి సీనియర్లు తాత్కాలికంగా సీఈవో బాధ్యతలు చేపట్టే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ప్రణాళిక ప్రకారమే అంతా ముందుకెళితే, టెక్ విశ్లేషకుల అంచనాల ప్రకారం జాన్ టర్నస్‌కే ఈ బృహత్తర బాధ్యత దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగే అంశంపై ఇప్పటివరకు టిమ్ కుక్ తన మనసులో మాట బయటపెట్టకపోయినా, ఒకవేళ కొత్త సీఈవో వస్తే, ఈ తీవ్రమైన పోటీ ప్రపంచంలో యాపిల్‌ను అదే సమర్థతతో ముందుకు తీసుకెళ్లాల్సిన భారీ బాధ్యత అతనిపై ఉంటుంది.

Rohit: ఫిట్ గానే ఉన్నా పక్కనపెట్టారు రోహిత్ పై వేటు వెనుక కారణాలివే..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button