Just Lifestyle

Emoji:ఎమోజీలు ఎలా పుట్టుకొచ్చాయో తెలుసా..?

Emoji:మనసులో ఎన్నో భావాలు. ఏదో చెప్పాలని అనుకుంటాం కానీ పదాలు తట్టవు. అటువంటపుడు మనసులో ఉన్న నిర్వచించలేని భావాన్ని ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు

Emoji:మనసులో ఎన్నో భావాలు. ఏదో చెప్పాలని అనుకుంటాం కానీ పదాలు తట్టవు. అటువంటపుడు మనసులో ఉన్న నిర్వచించలేని భావాన్ని ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు. వాట్సాప్ లాంటి ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌లు వచ్చిన తర్వాత వీటి ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయింది. పెరుగుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా టెక్నాలజీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఎమోజీలను ప్రవేశపెడుతున్నాయి. మరి ఈ ఎమోజీ(emojis)ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Emoji

ఎమోజీ పుట్టుక ఎప్పుడో తెలుసా?
అమెరికా 16వ అధ్యక్షుడు జాన్ అబ్రహాం లింకన్ 1862లో తన ప్రసంగంలో కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించగా.. అప్పుడు ఆ ప్రసంగం వింటున్నవారు పడిపడి నవ్వారట. అప్పట్లో కొందరు టైపోగ్రాఫర్లు లింకన్ ప్రసంగంలో వ్యంగ్యాస్త్రాల పక్కన కన్నుగీటే సైగ ఎమోజీని పెట్టారట. అందుకే ప్రపంచంలో మొట్టమొదటిసారి అబ్రహాం లింకనే ఎమోజీని వాడారని అంటారు.

అంతేకాకుండా అప్పటి సామాజిక మాధ్యమాలైన యాహూ మెయిల్, యాహూ మెసెంజర్‌లలో వినియోగదారుల సౌకర్యం కోసం యాహూ సంస్థ ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. సాంకేతిక రంగంలో అప్పటినుంచి ప్రారంభమైన ఎమోజీల ప్రస్థానం ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. అయితే మొబైల్ రంగంలోకి ఎమోజీలను తీసుకొచ్చిన ఘనత మాత్రం జపాన్‌ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్‌టీటీ డొకామో’ ఇంజినీర్ షిగెటకా కురిటాకు దక్కుతుంది.

ఎమోజీలను ఎలా ఆమోదిస్తారు?
ఎమోజీలు యూనికోడ్ కన్సార్టియం అనే సంస్థ నియంత్రణలో ఉంటాయి. అందుకే వేటిని పడితే వాటిని వినియోగంలోకి తీసుకురారు. యూనికోడ్ ఆమోదం తర్వాతే వినియోగంలోకి తీసుకొస్తారు. అనంతరం మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అందుబాటులోకి వస్తాయి. యూనికోడ్ కన్సార్టియంలో పలు ప్రముఖ టెక్నాలజీ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం 3,663 ఎమోజీలు వరకు అందుబాటులో ఉండగా, 100 ఎమోజీలను అధికంగా వినియోగిస్తున్నారు.

ఎమోజీ వల్ల లాభాలేంటి?

నేటి డిజిటల్ యుగంలో సంభాషణ విధానంలో ఉన్న ఒక పెద్ద ఖాళీని ఎమోజీలు పూరించాయని పలువురు కమ్యూనికేషన్(Communication) నిపుణులు చెబుతున్నారు. ఎమోజీలతో సమర్థవంతంగా భావాలను వ్యక్తం చేయడమే కాదు, అలాంటి సందేశాలకు త్వరగా సమాధానం కూడా వస్తుందని వారు అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button