Pithapuram varma: ఈ కర్మ వర్మ చేసుకుందేనా?
Pithapuram varma: శ్రీవాత్సవాయి సత్యనారాయణ వర్మ.. చాలా తక్కువ మందికి తెలిసిన పేరు. SVSN వర్మ అంటే కూడా కొందరికే తెలుసు.. అదే పిఠాపురం వర్మ (Pithapuram varma) అంటే అందరికీ వెంటనే గుర్తొస్తారు. ఒకప్పుడు పేరుమోసిన లీడర్. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు.

Pithapuram varma: శ్రీవాత్సవాయి సత్యనారాయణ వర్మ.. చాలా తక్కువ మందికి తెలిసిన పేరు. SVSN వర్మ అంటే కూడా కొందరికే తెలుసు.. అదే పిఠాపురం వర్మ (Pithapuram varma) అంటే అందరికీ వెంటనే గుర్తొస్తారు. ఒకప్పుడు పేరుమోసిన లీడర్. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. మంచి మెజార్టీని సాధించారు. నియోజకవర్గంలో తనకు తిరుగులేని నేతగా ఎదిగారు. అలా రాను రాను నియోజకవర్గం పేరే ఆయన ఇంటి పేరు అయింది. అంత ఎత్తుకు ఎదిగిన వర్మ ఇప్పుడు డీలా పడిపోయారు. ఆయన పేరు కూడా పెద్దగా వినపడడం లేదు. అక్కడక్కడా వినపడ్డప్పటికీ ఆయనపై సింపతీ చూపించే వారు కొందరైతే.. ఆయనకు ఆయన చేసుకున్న కర్మ అనే వారు మరికొందరు ఉన్నారు.
2019లో ఓడినప్పటికీ 2024 ఎన్నికలే టార్గెట్ గా వర్మ పని చేశారు. తన వ్యూహాలకు పదును పెట్టి పార్టీని బలోపేతం చేశారు. తన కేడర్ ను కూడా అన్ని విధాలుగా సిద్ధం చేశారు. కానీ 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ జట్టుగా బరిలోకి దిగాయి. కూటమిగా బరిలోకి దిగడం కొందరు నేతలకు కలిసొస్తే.. వర్మకు మాత్రం బిగ్ షాక్ తగిలింది. పొత్తులో భాగంగా పిఠాపురం జనసేనకు వెళ్లింది. చివరి వరకు వర్మ టికెట్ కోసం ఎంతో ఫైట్ చేశారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగింపులకు లొంగిపోక తప్పలేదు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తాం.. పార్టీలో సముచిత హోదా కల్పిస్తామని వర్మను బుజ్జగించారు. ఏకంగా వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక చివరికి పిఠాపురం నుండి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసి గెలుపొందారు. చివరికి కూటమి అధికారంలోకి వచ్చాక అయినా వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు.. పార్టీలో సముచిత స్థానం లేదు. చివరికి వర్మ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఇటు జనసేన పిఠాపురంలో స్పీడ్ పెంచింది. పిఠాపురాన్ని తన కంచుకోటగా మార్చుకునేందుకు జనసేనాని పావులు కదుపుతున్నారు. పిఠాపురం అంటే పవన్ అడ్డా అన్న రేంజ్‌కు తీసుకెళ్తున్నారు.
దీంతో ఒకప్పుడు పిఠాపురానికి రాజులా ఓ వెలుగు వెలిగిన వర్మ ఇప్పుడు కటిక చీకట్లో గడుపుతున్నారట. తన భవిష్యత్తు ఏంటో అర్థంకాని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు వర్మ అసంతృప్తి పీక్స్‌కు చేరిందనే చర్చ నడుస్తోంది. దీనికి వర్మ చేతులారా చేసుకున్న పనులు కూడా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికైనా అధిష్టానం వర్మ వైపు చూస్తుందా?..సముచిత స్థానం కల్పిస్తుందా?.. లేదంటే వర్మను పూర్తిగా సైడ్ చేసి నియోజకవర్గాన్ని జనసేనకు వదిలేస్తుందా? అన్నది చూడాలి.