Just TelanganaLatest News

Formula-E race case: కేటీఆర్‌కు బిగ్ షాక్.. ఫార్ములా-ఈ రేసు కేసు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

Formula-E race case: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి మంజూరు చేశారు.

Formula-E race case

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా-ఈ కారు రేసు (Formula-E race case)నిర్వహణలో జరిగిన ఆర్థిక అక్రమాల ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి మంజూరు చేశారు.

ఈ (Formula-E race case)కేసు ప్రధానంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్‌లో జరిగిన మొట్టమొదటి ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహణలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ద్వారా ఈ రేసు నిర్వహణ కోసం సుమారు రూ. 55 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించారు. ఈ చెల్లింపులు చేసే ముందు, కేబినెట్, ఆర్థిక శాఖ, మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోలేదనేది ప్రధాన ఆరోపణ.

అనుమతులు లేకుండా చెల్లింపులు చేయడంతో, ఈ లావాదేవీలపై రూ. 8 కోట్లకు పైగా పన్ను జరిమానా (Penalty) విధించబడింది. ఈ అక్రమాలపై అనుమానం రావడంతో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా-ఈ రేసు యొక్క రెండో సీజన్‌ను రద్దు చేసింది. అలాగే, విధించిన జరిమానా మొత్తాన్ని చెల్లించింది. తర్వాత, ఈ అక్రమాలపై సమగ్ర విచారణ కోసం ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.

ఏసీబీ విచారణ, ఎఫ్‌ఐఆర్(Formula-E race case) , నిందితులు.. 2024 ఏప్రిల్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసింది.

Formula-E race case
Formula-E race case

ఎఫ్‌ఐఆర్‌(Formula-E race case)లో నిందితులుగా పేర్కొనబడినవారు కేటీఆర్ (BRS వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి),అరవింద్ కుమార్ (అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ),బీఎల్‌ఎన్ రెడ్డి (HMDA చీఫ్ ఇంజినీర్)

కేటీఆర్ మాజీ మంత్రి కావడంతో, అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act) లోని సెక్షన్ 17ఏ ప్రకారం, ఆయనపై విచారణ చేపట్టడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా, గవర్నర్ డిసెంబర్ 2024లో విచారణకు అనుమతినిచ్చారు. ఈ ఆమోదాన్ని చీఫ్ సెక్రెటరీ ద్వారా ఏసీబీకి పంపనున్నారు.

కాగా ఇప్పుడు ఈ కేసుపై గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. గవర్నర్ అనుమతితో ఏసీబీ ఇప్పుడు కేసు దర్యాప్తును ముందుకు తీసుకుపోవడానికి మరియు అవసరమైతే నిందితులను విచారించడానికి, అరెస్ట్ చేయడానికి పూర్తి అధికారాలు పొందుతుంది.

ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ ముందు హాజరై విచారణలో పాల్గొన్నారు. గవర్నర్ అనుమతి తర్వాత విచారణ ప్రక్రియ కొత్త మలుపు తీసుకుంటుంది.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అని వ్యాఖ్యానించారు, చట్ట పాలనను నొక్కి చెప్పారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ రేసును హైదరాబాద్‌ను గ్లోబల్ ఈ-మొబిలిటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి మాత్రమే నిర్వహించామని, ఇది పూర్తిగా “రాజకీయ కక్ష సాధింపు చర్య” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తూ, బీఆర్‌ఎస్‌కు ఒక బిగ్ షాక్‌ అయింది.

Rajinikanth Times: రజనీకాంత్ టైమ్స్..బస్ కండక్టర్ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button