Just TelanganaLatest News

Hyderabad roads: హైదరాబాద్‌ రోడ్లకు ప్రముఖుల పేర్లు.. సమ్మిట్ వేళ ఇంకా ఎన్నో కీలక నిర్ణయాలు

Hyderabad roads: హైదరాబాద్ వేదికగా ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Hyderabad roads

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్‌కు ముందు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు నగరంలోని పలు ప్రధాన రహదారుల(Hyderabad roads) అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖులు, దిగ్గజ సంస్థల పేర్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌ను పెట్టుబడులు, సాంకేతికతకు గ్లోబల్ హబ్‌గా నిలపాలనే లక్ష్యంతో ఈ (Hyderabad roads)నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా, ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా పేరును పెట్టనున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ‘ట్రంప్ ఎవెన్యూగా నామకరణం చేయాలని యోచిస్తున్నారు.

Hyderabad roads
Hyderabad roads

ఈ ప్రతిపాదనలతో పాటు, టెక్నాలజీ ప్రపంచానికి హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో.. గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ వంటి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనల అమలుపై కేంద్ర విదేశాంగ శాఖకు, అలాగే అమెరికా రాయబార కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రేవంత్ సర్కార్ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, గ్లోబల్ సమ్మిట్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి.

హైదరాబాద్ వేదికగా ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఉద్దేశించిన ఈ(Hyderabad roads) సదస్సు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు.

ఈ సమ్మిట్‌కు 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యంగా, అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొనడం గమనార్హం.

Hyderabad roads
Hyderabad roads

ఈ సమ్మిట్‌లో ప్రసంగించనున్న అంతర్జాతీయ ప్రముఖులలో నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్వైడర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా వంటి దిగ్గజాలు ఉన్నారు.

ప్రముఖుల ప్రసంగాల అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండనుంది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పాలన, పెట్టుబడులకు అవకాశాలు, కంపెనీలకు ప్రభుత్వ సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, మరియు భారత్ ఫ్యూచర్ సిటీపై తన దృక్పథాన్ని ప్రపంచానికి తెలియజేయనున్నారు.

అంతర్జాతీయ ప్రతినిధులకు తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు వివిధ రూపాల్లో ప్రదర్శనలు, నగరంలో లైటింగ్ ప్రొజెక్షన్, 3D ప్రాజెక్షన్ మ్యాపింగ్, ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రచారం చేయనున్నారు.

Hyderabad roads
Hyderabad roads

అతిథుల కోసం ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.నాగార్జున సాగర్ దగ్గర ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రమైన బుద్ధవనంను ప్రతినిధులు దర్శించేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ప్రతినిధులకు హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ధ వంటకాలతో విందు అందించనున్నారు. ప్రత్యేక సావనీర్లతో పాటు, తెలంగాణ ప్రత్యేకమైన వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక గిఫ్ట్ బాస్కెట్‌ను కూడా అతిథులకు అందించి గౌరవించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button