Just TelanganaJust CrimeLatest News

Ibomma Ravi: ఐబొమ్మ రవి పైరసీ కింగా? టెక్ దిగ్గజమా? అసలీ కేసులో ఏం జరుగుతోంది?

Ibomma Ravi: తాజాగా రవి కేసుపై తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. పైరసీ తీవ్రత, దాని విస్తృతిని పరిశీలించేందుకు సీఐడీ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులు , ఈడీ అధికారుల నుంచి పూర్తి వివరాలను సేకరించారు.

Ibomma Ravi

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐబొమ్మ రవి (Ibomma Ravi)పైరసీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో విచారణాధికారాలు, దృష్టి కోణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగగా, తాజాగా తెలంగాణ సీఐడీ (CID) ఎంట్రీ ఇవ్వడం ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టం చేసింది. మరోవైపు, సినీ పరిశ్రమ కఠిన శిక్షను డిమాండ్ చేస్తుండగా, సోషల్ మీడియాలో మాత్రం రవికి టెక్ దిగ్గజంగా మద్దతు పెరుగుతోంది.

CID, ED ఎంట్రీతో ట్రిపుల్ ఫోకస్..ఫ్రాన్స్ నుంచి నవంబర్ 6న హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో అతడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.

తాజాగా రవి(Ibomma Ravi) కేసుపై తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. పైరసీ తీవ్రత, దాని విస్తృతిని పరిశీలించేందుకు సీఐడీ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులు , ఈడీ అధికారుల నుంచి పూర్తి వివరాలను సేకరించారు.

విచారణలో సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. రవి దాదాపు 21 వేలకు పైగా సినిమాలను పైరసీ చేశాడని అంగీకరించాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి మూడు దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి, అశ్విన్‌కుమార్, కిరణ్‌కుమార్ వంటి వారికి లక్షలు చెల్లించి, ఐబొమ్మ, ఐవిన్, బప్పం లాంటి 17 వెబ్‌సైట్లను ఒంటిచేత్తో నడిపినట్లు విచారణలో తేలింది.

Ibomma Ravi
Ibomma Ravi

మనీలాండరింగ్ అనుమానంతో ఈడీ అధికారులు హైదరాబాద్ సీపీకి లేఖ రాసి కేసు వివరాలు కోరారు. రవి బ్యాంక్ ఖాతాల్లో రూ. 20 కోట్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా నెలకు రూ. 15 లక్షల ట్రాన్స్‌ఫర్‌లను గుర్తించారు. విదేశీ బ్యాంకులు మరియు క్రిప్టో వాలెట్ల ద్వారా పైరసీ సంపాదన దాచినట్లు ఈడీ అనుమానిస్తోంది.

పోలీసు వర్గాల ప్రకారం, రవి నుంచి సేకరించిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ల పాస్‌వర్డ్‌లను జల్లెడ పడుతున్నారు. రవిపై నమోదైన మరో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లకు అనుగుణంగా, అతడిని పీటీ వారెంట్‌ల మీద అరెస్టు చేసి, మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.అయితే రవి విచారణకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా పోలీసులు బయటపెట్టడం లేదు.

మరోవైపు రవి అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, అభిప్రాయాలు మాత్రం రెండుగా చీలిపోయాయి.

నిర్మాతలు, దర్శకులు, హీరోలు పైరసీ వల్ల ఎదురవుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రవి(Ibomma Ravi)ని కఠినంగా శిక్షించాలని, కొందరైతే ఎన్‌కౌంటర్ వరకు డిమాండ్ చేస్తున్నారు. రవిని చాలామంది హీరోగా ఎందుకు చూస్తున్నారో తమకు అర్ధం కావడం లేదంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినీ పరిశ్రమకు పూర్తి విరుద్ధంగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రవి(Ibomma Ravi)కి మద్దతుగా వేల సంఖ్యలో కామెంట్లు, రీల్స్ వస్తున్నాయి. నెటిజన్లు అతడిని టెక్ దిగ్గజంగా అభివర్ణిస్తున్నారు. అసలు రవి వైఫ్ సమాచారం ఇవ్వకపోతే పోలీసులు ఇప్పటికీ రవిని పట్టుకోలేరంటూ విమర్శలు సందిస్తున్నారు. ఇందులో పోలీసుల గొప్పతనం లేదని, పోలీసులు ఎప్పుడూ డబ్బున్నవారి పక్షానే అని.. కానీ రవి అలా కాదని..తాను సామాన్యుల కోసమే ఇలా చేశాడని నిజంగా రవి గ్రేట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

సినిమా థియేటర్లకు వెళ్లలేని సామాన్యులకు తక్కువ డేటాలో (తక్కువ MB) సినిమాలు అందించడం వల్ల ఐబొమ్మ వేగంగా ప్రజాదరణ పొందిందని నెటిజన్లు వాదిస్తున్నారు. “టికెట్ ధరలు ఎక్కువ, అందుకే ఐబొమ్మ ఉపయోగపడింది!” అంటూ రవికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.చివరకు ఎప్పుడూ మీడియా ముందుకు రాని మహిళలు కూడా రవికి మద్దతుగా వీడియో సందేశం ఇస్తున్నారు. రవి తరపున వాదిస్తానన్న లాయర్ కూడా రవికి ఇంత మంది మద్దతు దారులు ఉన్నారన్న సంగతి తెలీదంటూ చాలా కేసులు వాదించాను కానీ ఇలాంటి అభిమానులను చూడలేదని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో రవి హవా పెరుగుతుండగా, ఇప్పుడు అతడి జీవితం వెండితెరపైకి రాబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ అనే నిర్మాణ సంస్థ రవి జీవితంపై బయోపిక్ తీయడానికి సిద్ధమయింది. రవి జీవితంలో జరిగిన తెలియని సంగతులు, అతడి పోరాటాలు, ఎదుర్కొన్న అవమానాలు, ఐబొమ్మ వెనుక ఉన్న చీకటి కోణాలును కూడా ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం.  మరి ఇందులో రవిని హీరోను చేస్తారా, లేక జీరోను చేస్తారో చూడాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button