Global Summit: గ్లోబల్ సమ్మిట్ అంతా ఉత్తదేనా ? ఎంవోయూలపై రచ్చ రచ్చ
Global Summit: వారి చేసిన హడావుడి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు తప్పిస్తే మిగిలిన వారికి ఎవ్వరికీ ఉపయోగం లేదన్నది అక్కడకు వచ్చిన వారందరికీ అర్థమైంది.
Global Summit
హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ (Global Summit)అంగరంగ వైభవంగా జరిగింది… మోస్ట్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న గ్లోబల్ సమ్మిట్ నిజంగానే సక్సెస్ అయిందా అంటే సమాధానం మాత్రం అధికార పార్టీ నేతల నుంచే డౌట్ డౌట్ గా వస్తోంది. కోట్ల ఖర్చుతో సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో 2 రోజుల పాటు పిక్నిక్ స్పాట్ కనిపించిందన్న విమర్శల్లో చాలా వరకూ నిజమనే అంగీకరించకమానదు.
బిజనెస్ సమ్మిట్(Global Summit) కు సంబంధం లేని సినిమా వాళ్లని పిలిచి నానా హడావుడి చేశారు. కనీసం వారు మాట్లాడే స్పీచ్ లలో తెలంగాణకు పెట్టుబడులు రావాలన్న కామెంట్స్ కూడా వినిపించలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ పలువురు కాంగ్రెస్ నేతలు ఎందుకు హడావుడి చేస్తూ తిరిగారో వారికే తెలుసు. వారి చేసిన హడావుడి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు తప్పిస్తే మిగిలిన వారికి ఎవ్వరికీ ఉపయోగం లేదన్నది అక్కడకు వచ్చిన వారందరికీ అర్థమైంది.

రెండు రోజుల సదస్సులో మొదటిరోజు కరణ్ ఆదాని, రెండో రోజు చివర్లో ఆనంద్ మహేంద్ర తప్ప ఒక్క చెప్పుకోదగిన వ్యాపారవేత్త కనిపించలేదు.ఆశ్చర్యం ఏమిటంటే తెలంగాణకు చెందిన బిజినెస్ మ్యాన్ లు సైతం ఇక్కడ కనిపించకపోవడం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, లాంటి వాళ్ళు వచ్చి ఉంటే బిజినెస్ సమ్మిట్(Global Summit) హిట్ అనేందుకు ఆస్కారం ఉండేది. ముఖ్యంగాఒప్పందాలకు సంబంధించి అంకెలన్నీ ఆకాశాలు దాటిపోయాయి.
అయితే సదస్సులో జరిగిన ఎంఓయులలో 60 శాతానికి పైగా పుడ్ స్టోరేజీ, పవర్ ప్రాజెక్ట్స్, సోలార్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో ఇవన్నీ తాడు బొంగరం లేని MOUలే అంటూ విపక్ష బీఆర్ఎస్ తేల్చిపారేసింది. తెలంగాణ రైసింగ్ బిజినెస్ సమ్మెలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గాని, హైటెక్ ఇండస్ట్రీ గానీ, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని, కనిపించలేదు.
ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఎంవోయూలు చేసుకుని వెళ్లిన కంపెనీలు, వాటి బిజినెస్ ప్లాన్ లో ఈ ఎంఓయూలలు గురించి మెన్షన్ చేశాయా అంటే అనుమానమే. దీంతో బిజినెస్ సమ్మిట్ కు అయిన ఖర్చు , కుదుర్చుకున్న ఎంవోయూల మీద పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రాలు విడుదల చేయమని విపక్షాలే కాదు చాలా మంది విశ్లేషకులు సైతం డిమాండ్ చేస్తున్నారు.



