Just TelanganaLatest News

Kavitha: ఒకే పార్టీ..ఇద్దరు నేతలు..మాటల యుద్ధం..కేసీఆర్ మౌనం ఎందుకు?

Kavitha: కవితను టార్గెట్ చేసిన జగదీష్.. లిల్లీపుట్ కామెంట్లకు కౌంటర్

Kavitha

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇది అధికార పార్టీ వాయిస్ కాదు.. బీఆర్ఎస్ లోపల జరుగుతున్న మాటలలు మంటలతో తెలంగాణ పాలిటిక్స్(Telangana politics) హీటెక్కెతున్నాయి.

ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత (Kavitha) తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవాడే బీఆర్ఎస్‌లోని ఓ కీలక నేత అంటూ మండిపడ్డారు. పేరు ప్రస్తావించకపోయినా.. నల్లగొండలో బీఆర్ఎస్‌ను నాశనం చేసిన లిల్లీపుట్.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడు గెలిచాడు” అని ఫైర్ అవుతూ జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు.

అయితే దీనిపై తాజాగా జగదీష్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “కవితకు నా ఉద్యమ ప్రస్థానం మీద ఏమీ తెలియదు.. ఆమె జ్ఞానానికి జోహార్లు!” అంటూ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ శత్రువుల మాటలే కవిత వల్ల వినిపిస్తున్నాయంటూ సెటైర్ వేశారు.అంతేకాదు.. “ఆమెపై నేను వ్యతిరేకత కాదు.. సానుభూతి చూపిస్తున్నానంటూ కౌంటర్ వేశారు.

kavitha
kavitha

ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు, ఒకరిపై ఒకరు బహిరంగంగా కత్తులు దూస్తుంటే… పార్టీ అధినేత కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

అయితే ఇది అదే కేసీఆర్ కదా… 2014 నుంచి 2023 వరకూ తన కూతురు కవిత (kavitha)మీద ఈగ వాలనివ్వని నాయకుడు. ఆమెను ఏ ఒక్క మీడియా విమర్శించినా నిలదీసిన నేత. అలాంటి నేత ఇప్పుడు… జగదీష్ రెడ్డి నేరుగా తన గారాలపట్టి కవితను టార్గెట్ చేసినా ఎందుకు వారించడం లేదు.

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేటి నాయకుడిగా పేరొందిన జగదీష్ రెడ్డి… ఇప్పుడు ఓడిపోయిన నేత. ఇంకొకవైపు కల్వకుంటల కవిత… ఓడిపోయినా, కేసీఆర్ వారసత్వానికి ప్రతీక. అయితే ఇద్దరి మధ్య ఈ స్థాయి మాటల యుద్ధం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది?

బీఆర్ఎస్ లో మాటల యుద్ధాలు పెరిగిపోతున్నాయి. నేతల మధ్య విభేదాలు(BRS internal clash) బహిరంగమవుతున్నాయి. కానీ ఈ మాటల యుద్ధాన్ని నియంత్రించే నేత మాత్రం మౌనంగా ఉన్నాడు. ప్రజల మధ్య గందరగోళం పెరగకముందే, ఈ రాజకీయ నాటకానికి తెరదించాల్సిన అవసరం ఉంది.

Also Read: iPhone: ఓ మై గాడ్.. ఐఫోన్‌లో ఇన్ని మైండ్ బ్లోయింగ్ ఫీచర్లున్నాయా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button