Kondasurekha : పదునెక్కిన పరువు దావా..
Kondasurekha : కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

Kondasurekha
తెలంగాణ రాజకీయ వేదికపై మరో కీలక మలుపు తిరిగింది. రాజకీయ వ్యాఖ్యలకు రెచ్చిపోతూ వ్యక్తిగత దూషణల దాకా వెళ్లిన బీజేపీ నేత, మంత్రి కొండా సురేఖ( Kondasurekha)కు న్యాయస్థానం నుంచి గట్టి షాక్ తగిలింది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో, నిందితురాలు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు (Nampally court) స్పష్టం చేసింది.
ప్రాథమిక సాక్ష్యాల పరిశీలన తర్వాత, 2025 ఆగస్టు 21లోపు నిందితురాలి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆమెకు నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనల్లో పేర్కొన్న అంశాలతో కోర్టు ఏకీభవించింది. ఆరోపణలు పూర్తి ఆధారంలేకుండా, నేరుగా పరువుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడింది.

ఇంతకీ వివాదం ఏంటంటే… కొండా సురేఖ (Kondasurekha), ఓ రాజకీయ సభలో కేటీఆర్(KTR) పై వ్యాఖ్యలు చేస్తూ, సీనియర్ నటి సమంత విడాకుల అంశాన్ని లాగుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇవి సినీ పరిశ్రమ నుంచి మహిళా సంఘాల వరకు వ్యతిరేకత తెచ్చుకున్నాయి. వివాహం, వ్యక్తిగత జీవితం వంటి విషయాలను రాజకీయ విమర్శల కోసం వాడటం సరైంది కాదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
దీనిపై స్పందించిన కేటీఆర్, ఆమెపై పరువు నష్టం దావా వేయగా, కోర్టులో విచారణ కొనసాగుతోంది.తాజాగా, కోర్టు ఫిర్యాదుతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు, డాక్యుమెంట్లను పరిశీలించి, కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది ఒక్క పరువు సమస్య కాదని… పబ్లిక్ స్పీచ్‌లో విలువలు, బాధ్యత అవసరం అనే విషయాన్ని కోర్టు తీర్పు మరోసారి గుర్తు చేసింది.
ఇప్పుడు ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పదవుల బలం ఉన్నా, మాటలకు సంయమనం లేకపోతే… న్యాయస్థానాలు వెనుకాడవని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఇది కొండా సురేఖకి మాత్రమే కాదు..ఇకపై రాజకీయ వేదికలపై మాట్లాడే ప్రతీ నేతకు పరిమితిని దాటి మాట్లాడితే, న్యాయస్థానమే స్పందిస్తుంది అనే హెచ్చరికగా నిలవబోతోంది.
Also Read: HIV: ఎయిడ్స్‌ను అంతం చేసే కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది..