Just TelanganaLatest News

Medaram :మేడారం 2.0.. చిన్నపిల్లలకు ఏఐ సాంకేతికతతో భరోసా..ఎలా పనిచేస్తుంది ఇది?

Medaram : ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే డ్రోన్ల ద్వారా రద్దీని పర్యవేక్షిస్తూ, జియో ట్యాగింగ్ ఆధారంగా తప్పిపోయిన వారిని వెతకడం ఈజీ అవుతుంది.

Medaram

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల ముందు నుంచీ కూడా భక్తులు అమ్మవారి ప్రాంగణానికి క్యూ కడుతున్నారు. మహా జాతర సమయంలో ఉన్న రద్దీని తప్పించుకోవడానికి ముందుగానే అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే జాతర ముందే భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరగడంతో జంపన్న వాగు పరిసరాలు జనసంద్రంగా మారాయి.

లక్షలాది మంది వచ్చే ఈ జాతరలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోవడం అనేది పెద్ద సమస్య. గత జాతరలో దాదాపు 30 వేల మంది దారి తప్పి ఇబ్బంది పడ్డారు. అటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వరంగల్ పోలీసులు ‘మేడారం 2.0’ పేరుతో లేటెస్ట్ టెక్నాలజీని రంగంలోకి దించారు. దీనిలో ప్రధానంగా ‘రిస్ట్ బ్యాండ్’ (మణికట్టు పట్టీ) విధానం హైలైట్‌గా నిలుస్తోంది.

తెలంగాణలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఈ రిస్ట్ బ్యాండ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిల్లలు లేదా వృద్ధుల వివరాలను, వారి వెంట వచ్చిన పెద్దవారి ఫోన్ నంబర్లను నమోదు చేసి, ఒక క్యూఆర్ కోడ్ ఉన్న పట్టీని వారి చేతికి కడతారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే, పోలీసులు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిమిషాల వ్యవధిలోనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తారు.

ఇది గత మేడారం(Medaram )జాతరలో కూడా కొంతవరకు అమల్లో ఉన్నా కూడా, ఈసారి దీనిని ‘టీజీ క్వెస్ట్’ (TG Quest) అనే మరింత పటిష్టమైన ఏఐ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే డ్రోన్ల ద్వారా రద్దీని పర్యవేక్షిస్తూ, జియో ట్యాగింగ్ ఆధారంగా తప్పిపోయిన వారిని వెతకడం ఈజీ అవుతుంది.

Medaram
Medaram

వోడాఫోన్-ఐడియా సంస్థతో కలిసి ప్రత్యేకంగా ‘మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను సిద్ధం చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, గుంపులో ఎవరైనా కలిసిపోయినా వారి ఆచూకీ ఈజీగా తెలుస్తుంది. గడిచిన జాతరల్లో ఈ రిస్ట్ బ్యాండ్ల వల్ల వందలాది మంది చిన్నారులు సురక్షితంగా తమ తల్లిదండ్రుల చెంతకు చేరిన ఉదాహరణలు ఉన్నాయి.

అందుకే ఈసారి దీనిని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 15 ప్రధాన కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. భక్తులు మేడారం(Medaram ) వచ్చే ముందే తమ పిల్లలకు ఈ బ్యాండ్లు వేయించుకోవడం వల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా అమ్మవార్లను దర్శించుకోవచ్చు.

America:వణుకుతున్న అగ్రరాజ్యం అమెరికా.. 10 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ

Related Articles

Back to top button