Just TelanganaLatest News

Bhadradri Kothagudem:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీ.. శాస్త్రానికి అంతుచిక్కని చింత మొక్క

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరుగుతున్న చింత మొక్క: బ్రహ్మంగారి కాల జ్ఞానం నిజమవుతుందా?

Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, ములకలపల్లి మండలం, సీతారాంపురంలో ఒక వింత ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక ఇంటి వాకిట్లో ఉన్న చిన్న చింత మొక్క దానికదే గుండ్రంగా తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ వార్త వ్యాపించడంతో, ఈ అసాధారణ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

మొక్క (Tamarind plant) కదలడాన్ని గమనించిన స్థానిక మహిళ, వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి చూపించగా, వారంతా కలిసి పరిశీలించారు. మొక్కను ఏదైనా కీటకాలు లేదా క్రిములు కదిలిస్తున్నాయా అని జాగ్రత్తగా చూశారు, కానీ అలాంటిదేమీ లేదని తేలింది. దీనితో, ఈ (Bhadradri Kothagudem) ఘటనకు శాస్త్రీయ కారణాలు లేవని నిర్ధారించుకున్న గ్రామస్తులు, దీనిని ఒక దైవ సంకేతంగా భావిస్తున్నారు.

ఈ (Bhadradri Kothagudem)సంఘటనకు బ్రహ్మం గారి కాలజ్ఞానంతో ముడిపెడుతూ చర్చలు జరుగుతున్నాయి. “చింత చెట్టుకు చిరుమల్లె పూలు పూస్తాయి” వంటి వాక్యాలు గుర్తుకు వస్తున్నాయని, బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలో ఏదైనా గొప్ప మార్పు రాబోతోందని, ఇది దానికదే సూచన కావచ్చని అనేక రకాల అనుమానాలు, అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ వింత ఘటన గురించి అధికారులు లేదా శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఈ దృగ్విషయం వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ఘటన ములకలపల్లి మండలంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button