Just EntertainmentLatest News

OTT:ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీలోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్..

OTT: యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా ఇలా ... మీరు ఏ మూడ్‌లో ఉన్నా, ఈ వారం ఓటీటీలో మీకు నచ్చిన కంటెంట్ తప్పకుండా దొరుకుతుంది

OTT: ఎందుకో తెలీదు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త సినీ ప్రియులే అని చెప్పొచ్చు. కంటెంట్ బాగుండాలే కానీ ఇతర రాష్ట్రాల సినిమాలను కూడా కూడా అక్కున చేర్చుకుంటారు. అటు థియేటర్లలోనూ..ఇటు ఓటీటీలలోనూ కూడా మంచి మూవీ వచ్చిందంటే చాలు టైమ్ కాస్త అటూ ఇటూ అయినా చూడటం మాత్రం అస్సలు మిస్ అవరు.

ఈ వీక్ ఏ ఓటీటీలో ఏమేం మూవీస్ ఉన్నాయి..:

ఇలాంటివారికోసం ఈ వారం థియేటర్‌లలో కొత్త సినిమాల సందడి లేకపోయినా, ఇంట్లోనే కూర్చుని నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధంగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ‘ది 100’, ‘ఓ భామ అయ్యో రామ’, ‘వర్జిన్ బాయ్స్’ వంటి చిన్న మూవీలు మాత్రమే విడుదలయ్యాయి. లాస్ట్ వీక్ వచ్చిన ‘తమ్ముడు’, ‘కన్నప్ప’ చిత్రాలకు కూడా ఆడియన్స్ ఆదరణ తక్కువగానే ఉంది. ‘హరి హర వీరమల్లు’ వచ్చే వరకు థియేటర్ల వద్ద పెద్దగా సందడి కనిపించే అవకాశమే కనిపించడం లేదు. ఆ తర్వాత ‘కూలీ’, ‘వార్ 2’ వంటి భారీ సినిమాలు వరుసలో ఉన్నాయి.

అయితే, థియేటర్లలో సందడి లేకపోయినా, డిజిటల్ ప్రపంచంలో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేదు. మెయిన్‌గా అంతర్జాతీయ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ వారం పండగే అని చెప్పొచ్చేమో. ఇటీవల బాగా పాపులర్ అయిన ‘8 వసంతాలు’ చిత్రం ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంలో మంచి ప్రశంసలు అందుకున్న ‘కలియుగమ్ 2064’ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్‌లలో ఈ వారం కొత్త సినిమాల సందడి లేకపోయినా, డిజిటల్ ప్రపంచంలో మాత్రం నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేదు! ఈ వారం ఏకంగా 61 సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలై, సినీ ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో అన్ని జోనర్లలోని చిత్రాలు, సిరీస్‌లు ఉన్నాయి.

ఈ 61 చిత్రాల్లో, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా నిలిచినవి 21 సినిమాలు మాత్రమే. మన తెలుగు ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించేలా ఏకంగా 15 తెలుగు చిత్రాలు ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు దక్కించుకున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ ఓటీటీ దిగ్గజాలతో పాటు, ఇతర ప్లాట్‌ఫామ్‌లలోనూ వైవిధ్యమైన కంటెంట్ అందుబాటులోకి వచ్చింది.

ఈ వారం హైలైట్‌లు:

మెయిన్‌గా ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘నరివెట్ట’ (Narivetta) మూవీ ఇప్పుడు సోనీలివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గురువారం జులై 10 నుంచి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

‘8 వసంతాలు’:    ఈమధ్య బాగా బజ్ క్రియేట్ చేసిన 8 వసంతాలు మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది .థియేటర్లలో చూడని వారు, సింపుల్ అండ్ కూల్ లవ్‌స్టోరీలను ఇష్టపడే వారు ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఒక సున్నితమైన, భావోద్వేగమైన లవ్ స్టోరీని కోరుకునే వారికి నచ్చుతుంది.

కలియుగమ్ 2064′ (తమిళ్): సన్ నెక్స్ట్ లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం తమిళంలో మంచి ఆదరణ పొందింది.

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2′: హాట్‌స్టార్‌లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ ప్రియులకు పండుగే.

ఈ వారం మీ ఓటీటీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవాల్సిన చిత్రాలు, సిరీస్‌లు:

జియోసినిమా / డిస్నీ+ హాట్‌స్టార్:

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – జూలై 11

ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ సీజన్ 9 – జూలై 11

మూన్ వాక్ రీఫార్మ్

బరీడ్ ఇన్ ది బ్యాక్‌యార్డ్ సీజన్ 6 – జూలై 13

నెట్‌ఫ్లిక్స్:

8 వసంతాలు – జూలై 11

ఆప్ జైసా కోయి (హిందీ) – జూలై 11

సెవెన్ బేర్స్ (యానిమేషన్)

బ్రిక్ (హాలీవుడ్)

ఆల్మోస్ట్ కాప్స్ – జూలై 11

మడి యట్ డెస్టినేషన్ వెడ్డింగ్ – జూలై 11

అమెజాన్ ప్రైమ్ వీడియో:

కరాటే కిడ్స్-లెజెండ్స్ – (రెంట్ పద్ధతిలో స్ట్రీమ్ కానుంది)

ది అన్‌హోలీ ట్రినిటీ – జూలై 11

సోనీలివ్:

నరివెట్ట (మలయాళం) – జూలై 11

నోబు – జూలై 12

సన్ నెక్స్ట్:

కలియుగమ్ 2064 (తమిళ్) – జూలై 11

యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా ఇలా … మీరు ఏ మూడ్‌లో ఉన్నా, ఈ వారం ఓటీటీలో మీకు నచ్చిన కంటెంట్ తప్పకుండా దొరుకుతుంది. ఈ వీక్ మీ ఓటీటీ వాచ్‌లిస్ట్‌ను నింపేయడానికి రెడీ అయిపోండి మరి. మీకు నచ్చిన కంటెంట్‌ని ఎంచుకుని, ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button