Just PoliticalJust TelanganaLatest News

Bhagirath :హైకోర్టుకు బండి కుమారుడు..కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్

Bhagirath : బాధితురాలి ఫిర్యాదుతో భగీరథపై పోక్సో కేసు నమోదైంది. అదే సమయంలో తనను బ్లాక్ మెయిల్ చేసారంటూ భగీరథ కూడా కరీంనగర్ లో కేసు పెట్టాడు.

Bhagirath

తెలంగాణలో సంచలనం రేపుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. రాజకీయపరంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలకు దిగింది.

 

Bhagirath
Bhagirath

పోలీసులు కావాలనే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని గులాబీ పార్టీ మండిపడుతోంది. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ విమర్శలు గుప్పిస్తోంది. మద్యం తాగించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మైనర్ బాలిక కేసు పెట్టింది. నిజానికి ఆమె ఫిర్యాదు తీసుకునే విషయంలో పోలీసులు ఆలస్యం చేసారని కూడా వినిపించింది. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఇలా చేసారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది.

ఇదిలా ఉంటే పోలీసులు బాధితురాలి ఫిర్యాదును ఆలస్యంగా తీసుకోవడంపై సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. పారదర్శకంగా విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారనీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ను విచారణ అధికారిగా నియమించారు. ఈ కేసులో బాధితురాలి స్టేట్ మెంట్ ను మరోసారి రికార్డ్ చేయబోతున్నారు. అయితే బండి భగీరథ కేసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేసుకున్నారు.

సిట్ వేయడంతోనే బండి సంజయ్, సీఎం రేవంత్ లాలూచీ రాజకీయం బయటపడిందని హరీశ్ రావు అన్నారు. ఈ విమర్శలు, ప్రతివిమర్శల మధ్య బండి భగీరథ(Bhagirath) బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బండి భగీరథ అందుబాటులో లేడని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతుండడం కూడా అనుమానాలకు తావిస్తోందంటున్నారు బీఆర్ఎస్ నాయకులు.

 

కాగా బాధితురాలి ఫిర్యాదుతో భగీరథ(Bhagirath)పై పోక్సో కేసు నమోదైంది. అదే సమయంలో తనను బ్లాక్ మెయిల్ చేసారంటూ భగీరథ కూడా కరీంనగర్ లో కేసు పెట్టాడు. దీంతో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button