Just LifestyleHealthLatest News

Insulin leave:ఇన్సులిన్ ఆకు..నిజంగానే డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుందా?

Insulin leave: డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు, ఈ ఆకులను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Insulin leave

డయాబెటిస్‌ (Diabetes) మన దేశంలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే ప్రకృతిలో దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉందని.. అదే ‘ఇన్సులిన్ ప్లాంట్’ (Costus Igneus) అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

దక్షిణ అమెరికా మూలాలున్న ఈ ఇన్సులిన్ మొక్క ఇప్పుడు భారత దేశంలో కూడా విరివిగానే పెరుగుతోంది. ఈ మొక్క ఆకులను ప్రతిరోజూ పరగడుపున నమిలి తింటే మంచిది. దీని వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఈ ఇన్సులిన్ ఆకు(Insulin leave)లో ఉండే సహజ రసాయనాలు డయాబెటిక్ పేషెంట్ శరీరంలోని క్లోమగ్రంథిని (Pancreas) ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయట. కేవలం చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను కూడా బయటకు పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఇవి బాగా తోడ్పడతాయి. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ తగినంత ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

అయితే ఈ ఇన్సులిన్ ఆకులను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉండాలి. అలాగే ఇప్పటికే డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు, ఈ ఆకులను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్కసారిగా చక్కెర స్థాయిలు పడిపోయే ప్రమాదం ఉంటుంది.

Insulin leave
Insulin leave

ఈ మొక్కను మనం ఇంటి పెరట్లో లేదా కుండీలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. దీని ఆకులు కాస్త పుల్లగా ఉండటం వల్ల తినడానికి కూడా బాగానే ఉంటుంది. మందులతో పాటు ఇలాంటి సహజ సిద్ధమైన మార్గాలను ఎంచుకోవడం వల్ల దుష్ప్రభావాలు (Side Effects) లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే వీటితో పాటు ఈ ఇన్సులిన్ ఆకు(Insulin leave)ను ఒక భాగంగా చేసుకుంటే షుగర్ వ్యాధిని జయించడం కష్టం కాదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Mirror:ఇంట్లో అద్దాల అమరిక వెనుక దాగున్న రహస్యాలు..ఏ దిశలో ఉంటే ఐశ్వర్యం వస్తుందంటే..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button