Latest News

Cricket : నెరవేరిన మజుందార్ కల.. మహిళా క్రికెట్ ద్రోణాచార్యుని కథ తెలుసా ?

Cricket : డొమెస్టిక్ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు.. పదుల కొద్దీ సెంచరీలు సాధించాడు.

Cricket

మన దేశంలో క్రికెట్(Cricket) కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏ గల్లీలో చూసిన బ్యాట్ పట్టి ఆడుతూ చాలా మంది కనిపిస్తూనే ఉంటారు..ఇన్ని వందల కోట్ల మందిలో కేవలం కొద్దిమందికే జాతీయ జట్టులో అవకాశం దక్కుతుంది. ఒక్కోసారి దేశవాళీ క్రికెట్ లో ఎంత అద్భుతంగా ఆడిన ఇండియాకు ఆడలేకపోవచ్చు. ఎందుకంటే 140 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాలో కేవలం 15 మందిని ఎంపిక చేయడం అంటే ఎంత కష్టమో వేరే చెప్పాలా.. కానీ దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టినా లక్ కలిసిరాకుంటే మాత్రం ఆ ఆటగాడి ప్రయాణం అక్కడితో ఆగిపోవాల్సిందే.. ప్రస్తుతం భారత మహిళల జట్టు కోచ్ గా ఉన్న అమోల్ మజుందార్ గతంలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. మజుందార్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు కోచ్ గా ఉండడంతో అతనెవరా అంటూ తెగ శోధిస్తున్నారు. నిజానికి దేశవాళీ క్రికెట్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి అతను సుపరిచితుడే.

Cricket
Cricket

డొమెస్టిక్ క్రికెట్ (Cricket)లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు.. పదుల కొద్దీ సెంచరీలు సాధించాడు. స్కూల్ క్రికెట్ లో వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ రికార్డ్ స్థాయి పార్టనర్ షిప్ మ్యాచ్ లో తర్వాతి బ్యాటింగ్ చేయాల్సిన బ్యాటర్ అతడే.. కానీ సచిన్-కాంబ్లీ రికార్డ్ కారణంగా మజుందార్ కు అసలు బ్యాటింగే రాలేదు. ఇది మాత్రమే కాదు అప్పుడు భారత జట్టులో సచిన్, కాంబ్లీతో సహా చాలామంది సుధీర్ఘంగా నిలదొక్కుకుపోవడంతో మజుందార్ దేశవాళీ క్రికెట్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక తన క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనని అతను కూడా అర్థం చేసుకున్నాడు. అయితే ఎవరికైనా సెకండ్ ఛాన్స్ ఉంటుంది. అమోల్ మజుందార్ కు కూడా సెకండ్ ఛాన్స్ వచ్చింది. అది కోచ్ గా బాధ్యతలు చేపట్టే రూపంలో వచ్చింది. దీనిని అద్భుతంగా ఒడిసి పట్టుకున్న మజుందార్ తక్కువ కాలంలోనే కోచ్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. రంజీ జట్లతో పాటు పలు చిన్న విదేశీ జట్లకు కోచ్ గా సేవలందించాడు. మంచి ట్రాక్ రికార్డ్ అందుకోవడంతో ఐపీఎల్ లో కూడా పలు జట్లకు పనిచేశాడు. అయితే 2023లో రమేశ్ పొవార్ కోచ్ గా రాజీనామా చేసిన తర్వాత భారత మహిళల జట్టుకు ఎంపికయ్యాడు.

Cricket
Cricket

భారత మహిళల క్రికెట్(Cricket) లో అప్పుడే మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి దిగ్గజాల నిష్క్రమణ మొదలైంది. ఇక్కడ నుంచి కొత్త తరం ప్లేయర్స్ తో జట్టును నడిపించాల్సిన బాధ్యత వచ్చింది. దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్న మజుందార్ జట్టులో పలువురు ప్లేయర్స్ ను మెరికల్లా తీర్చిదిద్దాడు. ఇటీవల ప్రపంచకప్ మొదలైన తర్వాత వరుసగా రెండు విజయాలతో భారత్ జోరు మీద కనిపించింది. కానీ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో టోర్నీ నుంచే నిష్క్రమించే పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి మజుందార్ చిన్నపాటి యుద్దాన్నే ఎదుర్కొన్నాడు. ప్రతీ క్రికెటర్ తో వ్యక్తిగతంగా సమావేశమై వారిలో పట్టుదల రగిల్చాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో ఆసీస్ తో మ్యాచ్ కు ముందు , సౌతాఫ్రికాతో ఫైనల్ కు ముందు అతను ఇచ్చిన స్పీచ్ చాలా స్ఫూర్తినిచ్చిందని షెఫాలీ వర్మ చెప్పింది. మొత్తం మీద ప్లేయర్ గా ఇండియాకు ఆడకున్నా ఇప్పుడు భారత జట్టుకు వన్డే వరల్డ్ కప్ అందించిన మజుందార్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Rajasab: సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న ‘రాజాసాబ్’? ప్రభాస్ అభిమానుల్లో నిరాశ!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button