Latest News

Kolkata : కోల్‌కతాకు డూ ఆర్ డై.. ప్లే ఆఫ్ బెర్తుపై ఆర్సీబీ గురి

Kolkata : ప్రస్తుతం ఆర్సీబీ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది.

Kolkata

ఐపీఎల్ 19వ సీజన్ లో కోల్‌కతా (Kolkata ) నైట్ రైడర్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకున్న కేకేఆర్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే కోల్ కతా(Kolkata ) ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజారినట్టే.

ప్రస్తుతం ఆ జట్టు 10 మ్యాచ్ లలో నాలుగు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 9 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్ మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలిచి రన్ రేట్ మెరుగుపరుచుకుంటే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. గత రెండు మ్యాచ్ లలో సన్ రైజర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ పై అద్భుత విజయాలతో కోల్ కతాకు ఫుల్ జోష్ వచ్చింది.

రహానే కెప్టెన్సీలోని ఆ జట్టు బౌలర్లు ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. అంకుల్ రాయ్ , వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి పేస్ విభాగంలో ఢిల్లీపై అదరగొట్టారు. అటు స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ చక్రవర్తి కూడా తమ మ్యాజిక్ చూపిస్తున్నారు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతోనే ఢిల్లీపై భారీ విజయాన్ని అందుకోగలిగింది.

అటు బ్యాటింగ్ లో ఫిన్ అలెన్ సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. రహానే, రఘువంశీ నిరాశ పరుస్తున్నా కూడా కామెరూన్ గ్రీన్, రింకూ సింగ్ , రోవ్ మన్ పావెల్ కీలకంగా ఉన్నారు. వీరంతా మరోసారి బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తే మాత్రం కేకేఆర్ కు భారీస్కోరు ఖాయం. నిజానికి ఈ సీజన్ ఫస్టాఫ్ లో కోల్ కతా ఏ విభాగంలోనూ క్లిక్ కాలేదు. రికార్డు ధర పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్ ఆరు మ్యాచ్ లలో విఫలమయ్యాడు. సెకండాఫ్ లో మాత్రం పుంజుకోవడంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్తుకు చేరువైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరినట్టే. ప్రస్తుతం ఆర్సీబీ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బ్యాటర్లు తడబడినా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా, టెయిలెండర్ భువనేశ్వర్ అద్భుత పోరాటంతో గెలిపించారు. దీంతో మరోసారి అటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబరచాలని ఎదురుచూస్తోంది.

Kolkata
Kolkata

బెంగళూరు టీమ్ కు ప్రధాన బలం విరాట్ కోహ్లీనే. అటు కోహ్లీతో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం బెథెల్, సాల్ట్ లో ఎవరికి దక్కుతుందనేది చూడాలి. పడిక్కల్, పటిదార్, జితేశ్ శర్మ , కృనాల్ వంటి వారితో బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. బౌలింగ్ లో బెంగళూరు పేస్ త్రయం అదరగొడుతోంది.

భువనేశ్వర్ , హ్యాజిల్ వుడ్ , సలామ్ దార్ త్రయం అద్భుతమైన బౌలింగ్ తో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా వెటరన్ పేసర్ భువనేశ్వర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇలాంటి సమయంలో ఆర్సీబీ బౌలింగ్ ను ఎదుర్కోవడం కేకేఆర్ కు పెద్ద సవాల్ గానే చెప్పాలి. గత రికార్డుల్లో మాత్రం బెంగళూరుదే పైచేయిగా ఉంది. ఇక రాయ్ పూర్ పిచ్ స్లోగా ఉండడంతో బ్యాటర్లకు పరుగులు చేయడం అంత ఈజీ కాదు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button