Just SportsLatest News

Commonwealth Games : నేటి నుంచే కామన్ వెల్త్ క్రీడా సంబురాలు..గ్లాస్గో వేదికగా ప్రతిష్టాత్మక క్రీడలు

Commonwealth Games : ఈసారి కామన్ వెల్త్ గేమ్స్‌కు తక్కువ బడ్జెట్ ఉండడంతో చాలా క్రీడలను తొలగించారు. కేవలం 10 క్రీడల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి.

Commonwealth Games

ప్రతిష్టాత్మక కామన్ వెల్త్ గేమ్స్(Commonwealth Games) గురువారం నుంచే గ్లాస్గో వేదికగా ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ క్రీడా పోటీల్లో బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండి, ప్రస్తుతం కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో సభ్యులుగా ఉన్న దేశాల క్రీడాకారులు పాల్గొంటారు.

మొదటిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈసారి కామన్ వెల్త్ గేమ్స్‌కు తక్కువ బడ్జెట్ ఉండడంతో చాలా క్రీడలను తొలగించారు. కేవలం 10 క్రీడల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. 74 దేశాల నుంచి 3 వేల మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్యం నుంచి వైదొలగడంతో, గ్లాస్గో తక్కువ సమయంలో బాధ్యతలు చేపట్టింది. ప్రభుత్వ నిధులు లేకుండా, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి గేమ్స్‌ను నిర్వహిస్తున్నారు. దీనివల్లే క్రీడలను కుదించారు. కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games) చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆరంభ వేడుకలను తొలిసారి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమిల్లా ఈ వేడుకకు హాజరై, క్రీడలను అధికారికంగా ప్రారంభించనున్నారు.

బ్రిటీష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ రెడ్ ఆరోస్ ఫ్లైఓవర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్కాట్లాండ్‌కు చెందిన ప్రముఖ సింగర్స్ టన్‌స్టాల్, టామ్ వాకర్, కలమ్ బీటీ, నినా నెస్‌బిట్, నాథన్ ఎవాన్స్ తమ సంగీత ప్రదర్శనలతో అలరించనున్నారు. కింగ్స్ బ్యాటన్ రిలే ఈ వేడుకతోనే ముగుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు జరిగిన క్రీడల్లో ఆస్ట్రేలియా అత్యధికంగా 2,000 పైగా పతకాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్‌కు కూడా కామన్వెల్త్ క్రీడల్లో అద్భుతమైన రికార్డు ఉంది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన గత కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

Commonwealth Games
Commonwealth Games

ఇప్పుడు గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి భారత్‌కు పతకాలు వచ్చే క్రీడలు లేకపోవడంతో ఈసారి పతకాలపై కొంత ప్రభావం పడనుంది. కాగా ఆగస్టు 2 వరకూ జరగనున్న ఈ క్రీడల తర్వాతి ఎడిషన్ 2030లో భారత్ ఆతిథ్యమివ్వనుంది. గ్లాస్గోలో జరగనున్న ముగింపు వేడుకులకు భారత ప్రధాని మోదీ హాజరై కామన్ వెల్త్ గేమ్స్ ఆతిథ్య పతకాన్ని అందుకుంటారని తెలుస్తోంది. 2030లో అహ్మదాబాద్ నగరం వేదికగా ఈ క్రీడలు జరగబోతున్నాయి.

Samsung Galaxy Z Flip 8 : ట్రెండీ లుక్‌తో అదుర్స్..మార్కెట్‌లో క్రేజీగా శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు

Related Articles

Back to top button