Latest News

Bank of Baroda:బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. 45 ఏళ్ల వయస్సున్నవారికీ కూడా ఛాన్స్

Bank of Baroda: కఠినమైన వయోపరిమితి నిబంధనలను సడలిస్తూ, ఏకంగా 45 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకునేలా ఈ భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం నిజంగా నిరుద్యోగులకు అద్భుత అవకాశమే.

Bank of Baroda

బ్యాంకు ఉద్యోగం సాధించాలనే ఇంట్రస్ట్, పట్టుదల ఉండి, వయస్సు దాటిపోతుందేమోనన్న ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం అంటేనే వయసు అడ్డంకిగా ఉంటుంది.

అలాంటి కఠినమైన వయోపరిమితి నిబంధనలను సడలిస్తూ, ఏకంగా 45 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకునేలా ఈ భారీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం నిజంగా నిరుద్యోగులకు అద్భుత అవకాశమే. అనుభవం , నైపుణ్యం కలిగినవారిని ఆహ్వానిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)దేశవ్యాప్తంగా వివిధ కీలక విభాగాల్లో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వీటిలో గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్ , డిప్యూటీ మేనేజర్ వంటి బాధ్యతాయుతమైన పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అయితే ఇవన్నీ ఉన్నత స్థాయి పోస్టులు కావడం వల్ల మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ కానీ డిప్లొమా ఉన్న వారికి కానీ మొదటి ప్రాధాన్యత లభించనుంది. అయితే మార్చి 27 నుంచే ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియడానికి ఇక సమయం దగ్గర పడుతోండటంతో ఇప్పటి వరకూ అప్లై చేయని వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 16, 2026 వరకు మాత్రమే అవకాశం ఉండటంతో మరికొన్ని గంటల వరకే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే స్పందించాల్సి ఉంటుందని అంటున్నారు.

Bank of Baroda
Bank of Baroda

వయస్సు విషయంలో అభ్యర్థులకు క్లారిటీ ఉండాలి. పోస్టుల స్వభావాన్ని బట్టి కనీస వయస్సు 24 నుంచి 31 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే గరిష్ట వయస్సును వివిధ విభాగాల ఆధారంగా 35, 40 ,45 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే రిజర్వేషన్ ఉన్న వారు మరింత ఎక్కువ వయస్సు ఉన్నా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్న మాట.

అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, జనరల్, ఓబీసీ ,ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం రూ. 175 గా ఈ ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేండిడేట్లు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో..ఆసక్తి ఉన్న వారు గడువు ముగియకముందే దరఖాస్తును పూర్తి చేయడం మంచిది.

పూర్తి వివరాలకు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. – https://bankofbaroda.bank.in/career/current-opportunities/recruitment-of-office-assistant-in-sub-staff-cadre-on-regular-basis

Intermediate:రేపే ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల..ఎక్కడ, ఎలా చూసుకోవాలో తెలుసా?

Related Articles

Back to top button