Onion : పచ్చి ఉల్లిపాయ డయాబెటిస్ రోగులకు సంజీవని..కానీ ఆ తప్పు చేయకూడదు
Onion : శాస్త్రీయ కోణంలో చూస్తే పచ్చి ఉల్లిపాయలో నేచురల్‌గానే క్రోమియం, శక్తివంతమైన ఫ్లేవనాయిడ్లు , యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని హఠాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
Onion
ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో డయాబెటిస్ అనేది ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతున్న ఒక నిశ్శబ్ద శత్రువుగా మారింది. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవడానికి రకరకాల మెడిసిన్స్ వాడుతున్నా.. మన వంటింట్లో ఉండే నేచురల్ ఆహార పదార్థాల ద్వారా దీనికి సమర్థవంతంగా చెక్ పెట్టొచ్చని తాజా వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
కేవలం పచ్చి ఉల్లిపాయ.. డయాబెటిస్ బాధితులకు ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుందని నిపుణులు నొక్కి చెబుతున్నారు. శాస్త్రీయ కోణంలో చూస్తే పచ్చి ఉల్లిపాయలో నేచురల్‌గానే క్రోమియం, శక్తివంతమైన ఫ్లేవనాయిడ్లు , యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని హఠాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
రోజువారీ భోజనంలో పచ్చి ఉల్లిపాయను రెగ్యులర్‌గా, లిమిట్‌గా తీసుకోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి మెరుగుపడటమే కాకుండా, కణాలు ఇన్సులిన్‌ను గ్రహించే కెపాసిటీ కూడా ఓ రేంజ్లో పెరుగుతుంది.
దీనికి తోడు ఆనియన్స్‌లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, క్వెర్సెటిన్ అనే అరుదైన పదార్థాలు బాడీలో ఇంటర్నల్‌గా ఉండే ఇన్ఫ్లమేషన్ను లేదా వాపులను తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడతాయి.

సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చి ఉల్లిపాయ(Onion) ను ఫుడ్‌లో చేర్చుకోవడం వల్ల అది రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు వజ్రకవచంలా ప్రొటెక్ట్ చేస్తుంది.
అయితే దీనిని సలాడ్ రూపంలో కానీ , పెరుగు అన్నంతో కానీ పచ్చిగా తింటేనే పూర్తి స్థాయి బెనిఫిట్స్ అందుతాయి. ఆనియన్ మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం మాత్రం జీర్ణకోశ సమస్యలు , కడుపులో గ్యాస్ వంటి అసౌకర్యం కలగొచ్చు.
కాబట్టి డాక్టర్ల సూచనలతో సరైన లైఫ్ స్టైల్‌ను అలవర్చుకుంటూ పచ్చి ఉల్లిపాయ(Onion )ను తింటే.. డయాబెటిస్‌ను మన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చు.
Relationship : మీ రిలేషన్షిప్లో అటెన్షన్ తగ్గిందా? కొత్త వాళ్ల వైపు అట్రాక్ట్ అవుతున్నారా?





