Travel: తక్కువ బడ్జెట్‌లో మీ డ్రీమ్ ట్రావెల్ ప్లాన్ చేసుకోండి..
Travel:చాలామంది ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదని భావించి తమ కలలను వాయిదా వేసుకుంటారు.

Travel
ప్రయాణం అంటే కేవలం కొత్త ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు, కొత్త అనుభవాలను, సంస్కృతులను తెలుసుకోవడం. అయితే, చాలామంది ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదని భావించి తమ కలలను వాయిదా వేసుకుంటారు. కానీ కొన్ని తెలివైన చిట్కాలు పాటిస్తే, డబ్బును వృథా చేయకుండా తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయవచ్చు.
ముందుగానే ప్లాన్ చేసుకోండి. ప్రయాణానికి కొన్ని నెలల ముందుగానే టికెట్లు, వసతి బుక్ చేసుకుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. చివరి నిమిషంలో బుక్ చేసుకుంటే ధరలు ఎక్కువగా ఉంటాయి.

లగ్జరీ హోటళ్లకు బదులుగా హాస్టళ్లు, హోమ్‌స్టేలు లేదా చిన్న బడ్జెట్ హోటళ్లు ఎంచుకోవచ్చు. ఇవి తక్కువ ధరకు లభిస్తాయి.అలాగే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు హోటళ్లలో తినకుండా, స్థానిక వీధి ఆహారాన్ని లేదా చిన్న రెస్టారెంట్లలో భోజనం చేయడం వల్ల రుచిని అనుభవించడంతో పాటు డబ్బు ఆదా అవుతుంది.
అవసరమైనవి మాత్రమే ప్యాక్ చేయండి. ప్రయాణానికి అవసరమైన దుస్తులు, వస్తువులను మాత్రమే ప్యాక్ చేయాలి. దీనివల్ల సామాన్ల బరువు తగ్గడమే కాకుండా, ఎయిర్‌లైన్స్ ఛార్జీలను తగ్గించుకోవచ్చు.ఈ చిట్కాలు పాటిస్తే, ప్రయాణం అనేది ఒక భారం కాకుండా, ఒక ఆనందకరమైన అనుభవంగా మారుతుంది.
Home Bound : ఆస్కార్ బరిలో జాన్వీకపూర్ మూవీ..హోమ్ బౌండ్ నామినేట్