Shravanamasam : శ్రావణంలో శుభకార్యాలకు మంచి ముహూర్తాలివే..
Shravanamasam : ఆషాఢ మాసం(Ashada Masam) పూర్తి కావడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ఏర్పడిన విరామం ముగిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ముహూర్తాల సమయం రానే వచ్చింది.

Shravanamasam : ఆషాఢ మాసం(Ashada Masam) పూర్తి కావడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ఏర్పడిన విరామం ముగిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ముహూర్తాల సమయం రానే వచ్చింది. పవిత్రమైన శ్రావణమాసం ఈరోజు నుంచి అంటే జూలై 25 నుంచి ప్రారంభం కానుండగా, ఇళ్లల్లో మళ్లీ సందడి వాతావరణం ప్రారంభం అవబోతోంది. పురోహితులు ఇప్పటికే వివాహాది, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలను ఖరారు చేశారు.
Shravanamasam
శ్రావణమాసం(Shravanamasam)లో తొలి పెళ్లి ముహూర్తం ఆగస్ట్ 27వ తేదీన. అయితే, అదే రోజున వినాయక చవితి పండుగ కూడా ఉండటంతో, కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు శుభకార్యాలు జరపకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఆగస్టు 3, 4 తేదీలతో పాటు, ఆగస్టు 25వ తేదీ వరకు పెళ్లిళ్లు(Wedding Muhurthams), గృహప్రవేశాలు, నామకరణం, అక్షరాభ్యాసం వంటి అనేక శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రావణమాసం ముగిసిన తర్వాత మళ్లీ దసరా, దీపావళి పండుగల సమయంలోనే వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉంటాయని పండితులు తెలియజేశారు.
సాధారణంగా తెలుగు క్యాలెండర్ లేదా పంచాంగం అనేది చంద్రుని గమనం, నక్షత్రాల ఆధారంగా పంచాంగ కర్తలు సిద్ధం చేస్తారు. చంద్రుడు ఏ నక్షత్రంలో పూర్ణిమ (పౌర్ణమి) నాడు ఉంటాడో, ఆ నక్షత్రం పేరుతో మాసాన్ని వ్యవహరిస్తారు. ఉదాహరణకు, విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమితో వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా, శ్రవణా నక్షత్రం ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) కారణంగా ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఇలా జ్యోతిష్యులు ఒక నిర్దిష్టమైన ‘కోడ్ భాష’ను ఉపయోగించి ఈ పంచాంగాలను రూపొందిస్తారని పురోహితులు వివరిస్తున్నారు.
శ్రావణ మాసం కేవలం వివాహాలకు మాత్రమే కాదు, పండుగలకు కూడా ప్రసిద్ధి. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి అనేక పండుగలు ఈ మాసంలో వస్తాయి. శ్రావణం ఆధ్యాత్మికంగా, శుభకార్యాలకు అత్యంత పవిత్రమైన మాసంగా పండితులు చెబుతారు. ఈ మాసంలో పెళ్లిళ్లు చేసుకుంటే దంపతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకం. ఇప్పుడు ముహూర్తాలు అందుబాటులోకి రావడంతో, ఆషాఢ మాసంలో ఆగిపోయిన శుభకార్యాలన్నీ తిరిగి ఊపందుకుని, ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొననుంది.
మీరు గృహప్రవేశాలు లేదా ఇతర శుభకార్యాలు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, ఆగస్టు 25 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే పురోహితులను సంప్రదించి తగిన తేదీని ఎంచుకోవచ్చు.