Just SpiritualLatest News

Kamada Ekadashi :ఈరోజే కామద ఏకాదశి .. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి

Kamada Ekadashi : పురాణాలు చెబుతున్న దాని ప్రకారం ఈ వ్రతాన్ని ఎవరైనా సరే భక్తితో ఆచరిస్తే బ్రహ్మహత్య వంటి మహా పాతకాలు కూడా తొలగిపోతాయట.

Kamada Ekadashi

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి గల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సకల పాపాలను హరిస్తూ, పుణ్యగతులను ప్రసాదించే ఈ తిథి అంటే శ్రీమహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమని పండితులు చెబుతారు. ముఖ్యంగా చైత్ర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని కామద ఏకాదశి అని పిలుస్తారు. కామద అంటే కోరికలను నెరవేర్చేది అని అర్థం.

ఈ ఏడాది ఈ పర్వదినం మార్చి 29, ఆదివారం రోజు వస్తుండటంతో దీనికి ఈసారి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పురాణాలు చెబుతున్న దాని ప్రకారం ఈ వ్రతాన్ని ఎవరైనా సరే భక్తితో ఆచరిస్తే బ్రహ్మహత్య వంటి మహా పాతకాలు కూడా తొలగిపోతాయట. అయితే, ఇలాంటి శక్తివంతమైన రోజు కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని శాస్త్రం హెచ్చరిస్తోంది.

కామద ఏకాదశి తిథి మార్చి 28వ తేదీ శనివారం ఉదయం 8:45 గంటలకే ప్రారంభమైనా సరే, సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం మార్చి 29 ఆదివారం రోజే వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజు ఆహార నియమాలు పాటించడమనేది చాలా ముఖ్యం.

ఏకాదశి రోజు ముఖ్యంగా అన్నం (బియ్యం), గోధుమలు, పప్పు ధాన్యాలు తీసుకోకూడదు. కూరగాయల్లో కూడా వంకాయ, క్యారెట్, క్యాబేజీ, పాలకూర వంటి వాటికి దూరంగా ఉండాలట. ఉపవాస సమయంలో అవిసె గింజలు తినకూడదని పండితులు సూచిస్తున్నారు.

ఆధ్యాత్మికంగా చూస్తే, విష్ణుమూర్తికి ప్రాణప్రదమైన తులసి ఆకులను ఏకాదశి రోజు కోయడం మహా పాపంగా పరిగణిస్తారు. పూజ కోసం తులసి దళాలు కావాలనుకునేవారు తప్పనిసరిగా ఒక రోజు ముందుగానే కోసి ఉంచుకోవాలి.

Kamada Ekadashi
Kamada Ekadashi

అలాగే ఈ రోజ జుట్టు కత్తిరించుకోవడం,గోళ్లు కత్తిరించడం , గడ్డం గీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అంతేకాదు ఎవరితోనూ గొడవ పడటం, ఇతరులను దూషించడం, పేదవారిని అవమానించడం వంటివి చేస్తే వ్రత ఫలం దక్కదు పైగా మహా పాపం చుట్టుకుంటుంది.వీటితో పాటు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చడం (చిమ్మడం) వంటి పనులు అస్సలు చేయకూడదు.

ఈ రోజు పాత బట్టలు, నూనె, ఇనుప వస్తువులను దానం తీసుకోవడం చేయకూడదు.అలాగే నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయడం అస్సలు చేయకూడదు. కామద ఏకాదశి ఉపవాసం ఉండాలనుకునేవారు.. రాత్రంతా జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం లేదా హరి నామ స్మరణ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మొత్తంగా నియమ నిష్టలతో ఈ కామద ఏకాదశిని ఆచరిస్తే కనుక కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పెద్దలు చెబుతారు.

Panchangam : పంచాంగం

Related Articles

Back to top button