Latest News

H1B Visa : ట్రంప్ సర్కార్‌కు షాకిచ్చిన కోర్టు..H1B వీసా రూల్స్ ఛేంజ్

H1B Visa : హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన లక్ష డాలర్ల భారీ ఫీజు నిర్ణయాన్ని కోర్టు పూర్తిగా కొట్టేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయింది .

H1B Visa

అమెరికాలో జాబ్ చేయాలనే కలలతో ఉండే లక్షలాది మందికి, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి అమెరికా ఫెడరల్ కోర్టు ఒక భారీ ఊరటనిచ్చే తీర్పును ఇచ్చింది.

హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన లక్ష డాలర్ల భారీ ఫీజు నిర్ణయాన్ని కోర్టు పూర్తిగా కొట్టేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయింది .

ఈ అసాధారణ ఫీజు భారం ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ను అతలాకుతలం చేస్తుందనే ఆందోళనల మధ్య ..తాజాగా వచ్చిన న్యాయస్థానం తీర్పుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ సంస్థలు, ప్రవాస భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

2025 సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని లోకల్‌గా జాబ్ చేసేవాళ్ల ప్రయోజనాలను కాపాడాలనే సాకుతో, కొత్తగా దాఖలు చేసే హెచ్-1బీ వీసా(H1B Visa) పిటిషన్లపై ఏకంగా ఒక లక్ష డాలర్ల ఫీజు విధిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

అమెరికాలోని కొన్ని కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీయులను తెచ్చుకుంటూ లోకల్‌లో ఉంటున్నవారికి అన్యాయం చేస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. అయితే ఈ భారీ ఫీజు నిర్ణయాన్ని అమెరికాలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి.

అంతేకాదు స్కిల్ ఉన్న ఉద్యోగుల కొరతతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న టెక్నికల్ అండ్ హెల్త్ రంగాలపై ఇది కోలుకోలేని దెబ్బ తీస్తుందనే కారణంతో .. 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.

వీరి పిటిషన్లపై విచారణ జరిపిన మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని చట్ట విరుద్ధమని ప్రకటిస్తూ..ఏకంగా దానిని రద్దు చేసింది. ప్రభుత్వం విధించిన ఈ లక్ష డాలర్ల ఫీజు నిజానికి ఒక పన్నుతో సమానమని కోర్టు అభిప్రాయపడింది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం కనుక చూస్తే.. దేశ పార్లమెంట్ అయిన కాంగ్రెస్ అనుమతి కానీ ఆమోదం కానీ లేకుండా ఇలాంటి భారీ పన్నులను డైరెక్టుగా విధించే అధికారం అధ్యక్షుడికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ ప్రభుత్వ విదేశీ వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఈ చారిత్రాత్మక తీర్పును అమెరికాలోని భారతీయ ప్రవాస సంస్థలన్నీ స్వాగతించాయి. ఈ నిర్ణయం ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌లో మళ్లీ న్యాయాన్ని, స్థిరత్వాన్ని పునరుద్ధరించిందని హర్షం వ్యక్తం చేశాయి.

టెక్నాలజీ, పరిశోధన రంగాలు ప్రపంచంలోనే అమెరికా అగ్రగామిగా నిలవడానికి.. విదేశాల నుంచి వచ్చే ప్రతిభావంతుల రోల్ ఎంతో ఉందని, ఇలాంటి సమయంలో భారీ ఫీజుల వడ్డింపులు వేయడం వల్ల అమెరికా కంపెనీలపైనే ఎక్కువ భారం పడి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా ఈ తీర్పుతో హెచ్-1బీ వీసా(H1B Visa)లపై ఆధారపడే ప్రతి వర్గానికి పెద్ద ఊరట లభించిందని ఇండియాస్పోరా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు కూడా తెలిపాయి.

అయితే ఈ వివాదం ఇక్కడితో పూర్తిగా ముగిసిపోయినట్లు కాదని, ఫ్యూచర్‌లో ప్రభుత్వ పరిపాలనా విభాగం తన లక్ష్యాలను సాధించడానికి చట్ట పరిధిలోనే ఇతర మార్గాలను అన్వేషించే ఛాన్స్ ఉందని, కాబట్టి ఈ విధానాలపై చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

హెచ్-1బీ వీసా(H1B Visa) అనేది అమెరికాలో ప్రత్యేక స్కిల్స్ కలిగిన ఉద్యోగాల కోసం విదేశీయులను అపాయింట్ చేసుకోవడానికి కంపెనీలకు ఉపయోగపడే అత్యంత కీలకమైన మార్గం.

H1B Visa
H1B Visa

ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్, మెడికల్ అండ్ ఫైనాన్షియల్ రంగాలలో ఈ వీసా పొందిన వారే కీ రోల్ పోషిస్తున్నారు. ఈ వీసా కేటగిరీ ద్వారా ప్రతి ఏటా ఎక్కువగా లబ్ధి పొందుతున్నది భారతీయ నిపుణులే కావడం గమనార్హం.

అందుకే అమెరికా వీసా నియమాలలో జరిగే ప్రతి చిన్న మార్పు భారతీయులపై డైరెక్ట్‌గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఆశిస్తున్న వేలాది మంది ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, డేటా సైంటిస్టులకు , అక్కడి టెక్ కంపెనీలకు పెద్ద పండుగలాంటి వార్తే అనే చెప్పాలి.

Laser Hair Removal : లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందా? నల్లగా ఉన్న వారికి ఇది సేఫేనా?

Related Articles

Back to top button