Latest NewsJust Lifestyle

Mindset : అతి సంతోషం, అత్యంత బాధ..ఏదొచ్చినా తట్టుకోలేని మైండ్‌సెట్..మరి మీరు ఏ టైప్‌?

Mindset : కొంతమంది చిన్న గుడ్ న్యూస్ విన్నా కూడా కొండంత సంతోషంతో ఊగిపోతారు. అదే చిన్న కష్టమో లేదా నిరాశో ఎదురైతే తట్టుకోలేనంత బాధలోకి కూరుకుపోతుంటారు.

Mindset

మన చుట్టూ ఉండే మనుషుల్లో కొంతమందిని గమనిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక చిన్న గుడ్ న్యూస్ విన్నా కూడా కొండంత సంతోషంతో ఊగిపోతారు, పట్టలేనంత ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అదే చిన్న కష్టమో లేదా నిరాశో ఎదురైతే చాలు.. లోకమంతా చీకటైపోయినట్లు, తట్టుకోలేనంత బాధలోకి కూరుకుపోతుంటారు.

సామాన్య భాషలో వీరిని అతిగా స్పందించేవారని అనుకున్నా.. సైకాలజీ దృష్టిలో చూస్తే ఇది కేవలం ఒక మెంటాలిటీ మాత్రమే కాదు. ఇది వారి మెదడులోని నరాల పనితీరు, వారి వ్యక్తిత్వం అలాగే ఎమోషనల్ రెగ్యులారిటీ సిస్టమ్‌కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన మెంటల్ కండీషన్.

మానసిక నిపుణులు ఇలాంటివారి మనస్తత్వాన్ని ఎమోషనల్ హైపర్‌ రియాక్టివిటీ లేదా ఎమోషనల్ ఇంటెన్సిటీ అని పిలుస్తారు. సైకాలజీ ప్రకారం చూస్తే.. మన మెదడులో భావోద్వేగాలను కంట్రోల్ చేసే ‘అమిగ్డాలా’ అనే భాగం అందరిలో ఒకేలా పనిచేయదు.

ఇలాంటి మైండ్‌సెట్(Mindset) ఉన్నవారిలో అమిగ్డాలా , చాలా సెన్సిటివ్‌గా, వేగంగా రియాక్టవుతుంది. సాధారణ మనుషులు 1 నుంచి 10 స్కేలుపై తమ ఎమోషన్స్‌ను 4 లేదా 5 వద్ద ఫీల్ అయితే, ఈ ఇంటెన్స్ పర్సనాలిటీ ఉన్నవారు మాత్రం సంతోషమైనా, బాధైనా డైరెక్టుగా 10 స్కేలు వద్దే ఫీల్ అవుతారు. వీరిలో డోపమైన్, సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల స్రావం కూడా చాలా ఫాస్టుగా, తీవ్రంగా జరుగుతుంది.

సైకాలజీలో వీరి మెంటాలిటీని హైలీ సెన్సిటివ్ పర్సన్ (HSP) వర్గంలో కూడా చూస్తారు. వీరు కేవలం తమ భావోద్వేగాలనే కాక, చుట్టూ ఉన్న పరిసరాలు, ఇతరుల మూడ్‌ను కూడా చాలా ఎక్కువగా స్వీకరిస్తారు.

అయితే దీని వెనుక మెయిన్‌గా మూడు కారణాలు ఉంటాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. దీనిలో మొదటిది
పూర్వ అనుభవాలు లేదా చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్నతనంలో అతిగా నెగిటివిటీని చూసినా, లేదా తమ భావాలను పంచుకోవడానికి సరైన వాతావరణం వారికి దొరక్కపోయినా.. పెద్దయ్యాక ప్రతీ అనుభూతిని డిఫెన్సివ్‌గా లేదా చాలా ఎక్కువగా ఫీల్ అవ్వడం అలవాటవుతుంది.

రెండోది ఎమోషనల్ రెగ్యులేషన్ లోపం. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా దాన్ని ఈక్వల్ లెవెల్‌లో స్వీకరించి, మెదడును శాంతపరిచే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పార్ట్ వీరికి సరిగా సహకరించదు. దీంతోనే భావోద్వేగాలు కంట్రోల్ తప్పి నదిలా ప్రవహిస్తాయి.

ఇక చివరిది ఆల్ ఆర్ నథింగ్ మైండ్‌సెట్. వీరు ప్రపంచాన్ని మధ్యస్థంగా చూడలేరు. వీరి దృష్టిలో ఏదైనా అత్యంత అద్భుతంగా అయినా ఉండాలి, లేదంటే అతి దారుణంగా అయినా ఉండాలి.

Mindset
Mindset

ఈ రకమైన ఇంటెన్స్ మైండ్‌సెట్(Mindset) వల్ల కొన్ని లాభాలు ఉన్నా, నష్టాలే ఎక్కువగా ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన సంతోషం వల్ల చాలా త్వరగా ఎగ్జైట్ అయి తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే తీవ్రమైన బాధ వల్ల త్వరగా మెంటల్ బర్న్‌ అవుట్, యాంగ్జైటీ, డిప్రెషన్ బారిన పడే ప్రమాదం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ రోలర్ కోస్టర్ రైడ్ వంటి మైండ్‌సెట్‌(Mindset) నుంచి బయటపడటానికి సైకాలజీలో కొన్ని సింపుల్ టిప్స్ సూచిస్తారు నిపుణులు. ఏదైనా ఎమోషన్ అంటే బాధ, సంతోషం వంటివి హై లెవెల్‌కు చేరినప్పుడు వెంటనే స్పందించకుండా పాజ్(Pause) కంక్లూజన్ చేసుకోవడం అలాగే మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ద్వారా మెదడును శాంతపరచడం, సంతోషం లేదా బాధ శాశ్వతం కాదనే డిటాచ్‌మెంట్ ఫీల్‌ను అలవాటు చేసుకోవడం ద్వారా ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

Belief : మైండ్ అండ్ రిలేషన్‌షిప్స్..పార్ట్‌నర్స్ మధ్య నమ్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంత ముఖ్యమా?

Related Articles

Back to top button