Just SportsLatest News

IND vs PAK : అమ్మాయిలూ అదరగొట్టండి..పాక్ మహిళలతో భారత్ పోరు

IND vs PAK : తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల సమరం జరగనుంది

IND vs PAK

ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, పురుషుల క్రికెట్ అయినా మహిళల క్రికెట్ అయినా ఈ పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్, పాకిస్తాన్(IND vs PAK) మధ్య మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

ఆదివారం బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల సమరం జరగనుంది. రాజకీయ కారణాలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. భారత్, పాక్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతున్నాయి. ఈ సందర్భంలో దాయాదుల క్రికెట్ సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్ గెలవలేదు. ఈసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడాలని పట్టుదలగా ఉన్న భారత్ తన టైటిల్ వేటను పాక్ పై భారీ విజయంతో మొదలుపెట్టాలని ఎదురుచూస్తోంది. పాకిస్తాన్‌తో పోలిస్తే భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గానే కనిపిస్తోంది. ముఖ్యంగా భారత బ్యాటింగ్‌ అత్యంత బలంగా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఓపెనర్లుగా ఇచ్చే ఆరంభాలే జట్టుకు కీలకం.

వీరిద్దరూ చెలరేగితే భారీస్కోరుకు పునాది పడడం ఖాయం. అలాగే జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ , రిచా ఘోష్ , దీప్తి శర్మలతో మిడిలార్డర్ సమతూకంగా ఉంది. భారతి ఫుల్మాలి లాంటి ఫినిషర్ జట్టులో ఉండడం మనకు అడ్వాంటేజ్. బ్యాటింగ్ లైనప్ లో ఏ ముగ్గురు రాణించినా పాక్ కు చుక్కలు గ్యారెంటీ.

మరోవైపు బౌలింగ్ లో మాత్రం భారత్ కాస్త వీక్ గా కనిపిస్తోంది. ఈ టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో మన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వార్మప్ మ్యాచ్ లలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో బౌలింగ్ పూర్తిస్థాయిలో గాడిన పడాల్సి అవసరం కనిపిస్తోంది. ప్రధాన టోర్నీలో బౌలర్లు పుంజుకుంటారని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కాన్ఫిడెంట్ గా ఉంది.

IND vs PAK
IND vs PAK

తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న శ్రీ చరణి, క్రాంతి గౌడ్, భారతి ఫుల్మాలి, నందిని శర్మ ఎలా రాణిస్తారో చూడాలి. రేణుకా సింగ్ ఠాకూర్ తో పాటు అరుంధతి రెడ్డి పేస్ విభాగంలో కీలకమని చెప్పొచ్చు. స్పిన్ విభాగంలో శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిలపై భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే పాక్ మహిళల జట్టు పేలవ ఫామ్ తో సతమతమవుతోంది. ఇటీవల ఐర్లాండ్ లో జరిగిన ముక్కోణపు సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పాక్ జట్టులో ఓపెనర్లు మునీబా అలీ, గుల్ ఫిరోజా, కెప్టెన్‌ ఫాతిమా సనా తప్పిస్తే మిగిలిన వారెవరూ ఫామ్ లో లేరు. గత రికార్డులు చూస్తే భారత్, పాకిస్తాన్(IND vs PAK) జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడితే..భారత్‌ 13 సార్లు గెలిచింది. పాక్‌ కేవలం మూడింటిలోనే విజయం సాధించింది.

Earth : బ్రెయిన్ కంటే పవర్‌ఫుల్ నెట్‌వర్క్ భూమి లోపల ఉందా? ఇది మనుషుల్ని ఎంతలా కాపాడుతుందో తెలుసా?

Related Articles

Back to top button