Just SportsLatest News

India : 39 పతకాలతో ముగింపు.. గ్లాస్గోలో  భారత్‌కు నాలుగో స్థానం

India : పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు వచ్చాయి. నాలుగు ఎడిషన్లతో పోలిస్తే పతకాలు తగ్గినా ఇది అత్యుత్తమ ప్రదర్శనగానే చెప్పాలి.

India

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ 39 పతకాలతో తమ ప్రయాణాన్ని ముగించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు వచ్చాయి. గత నాలుగు ఎడిషన్లతో పోలిస్తే పతకాలు తగ్గినా ఇది అత్యుత్తమ ప్రదర్శనగానే చెప్పాలి. ఎందుకంటే ఈసారి కామన్ వెల్త్ గేమ్స్ లో చాలా క్రీడాంశాలు తొలగించారు.

భారత్‌(India)కు ప్రతీసారీ కచ్చితంగా మెడల్స్ అందించే రెజ్లింగ్, షూటింగ్ , టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ , రగ్బీ, స్క్వాష్ వంటివి లేవు. దీంతో కేవలం 10 క్రీడాంశాలతోనే గ్లాస్గో గేమ్స్ నిర్వహించారు. పెద్దగా అంచనాలు లేని పారా అథ్లెట్లు సైతం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో.. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి మేజర్ ఈవెంట్లలో మన క్రీడాకారులు అదరగొట్టి అద్భుత విజయాలను అందించారు.

ముఖ్యంగా భారత బాక్సర్లు ఏడు స్వర్ణాలతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. మహిళల బాక్సింగ్‌లో ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్ , అరుంధతి చౌదరి , పురుషుల బాక్సింగ్‌లో సచిన్ సివాచ్, అంకుష్ ఫంగల్ బంగారు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, జూడోలో అస్మిత దే, హర్ష సింగ్, పారా అథ్లెటిక్స్ మహిళల షాట్ పుట్‌లో షర్మిల ధనకర్, పురుషుల షాట్ పుట్‌లో సోమన్ రాణా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు.

India
India

క్రీడాంశాల పరంగా చూస్తే అథ్లెటిక్స్‌లో 5 రజతాలు, 5 కాంస్యాలు, పారా అథ్లెటిక్స్‌లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం , జూడోలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం వచ్చాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ లో 1 స్వర్ణం, 6 రజతాలు, 1 కాంస్యం,  పారా పవర్ లిఫ్టింగ్‌లో 1 కాంస్యం, బాక్సింగ్‌లో 7 స్వర్ణాలు, 3 రజతాలు దక్కాయి.

2010 న్యూఢిల్లీ వేదికగా జరిగిన గేమ్స్‌లో 101 పతకాలు లభించగా, తర్వాత గ్లాస్గో వేదికగానే జరిగిన 2014 ఎడిషన్‌లో 64 పతకాలు వచ్చాయి. ఇక 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో భారత బృందం 66 పతకాలు గెలుచుకుంది. 2022 బర్మింగ్ హామ్‌లోనూ 60 పతకాలు సాధించింది.

Arunachalam : తెరుచుకున్న అరుణాచల మోక్ష మార్గం.. కానీ భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే..

Related Articles

Back to top button