Just NationalJust BusinessLatest News

Gold Price : గోల్డ్, సిల్వర్ రేట్లకు బ్రేక్.. ఈరోజు వీటి ధరలు ఎలా ఉన్నాయి?

Gold Price : కొద్దికాలంగా రాకెట్‌లా పైకి లేస్తున్న బంగారం రేట్లు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి.

Gold Price

ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవారు .. కానీ ఇప్పుడు తులం గోల్డ్ కొని చూడు అనేలా మారిపోయింది పరిస్థితి. పెళ్లిళ్లు, పండుగలు వస్తే తప్పనిసరిగా బంగారం కొనాలి. అలా అని కొనడానికి వెళ్దామంటే వీటి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే అలా ప్రతిరోజూ పెరిగిపోతూ వరుస షాక్‌లిస్తున్న పుత్తడి పరుగుకు ఈరోజు చిన్న బ్రేక్ పడింది.

కొద్దికాలంగా రాకెట్‌లా పైకి లేస్తున్న బంగారం రేట్లు(Gold Price) ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1లక్ష 32వేల200 దగ్గరే ఆగి ఉంది. ఇక బిస్కట్లు, కాయిన్స్ రూపంలో లభించే 99.9 శాతం 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ విషయానికొస్తే, దీని ధర రూ. 1లక్ష44వేల220 దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతోంది. వీటికి తోడు లేటెస్ట్ ట్రెండీ మోడల్స్, లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ కోసం వాడే 18 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1లక్ష8వేల160 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) రూ. 1 లక్ష 44వేల370 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష32వేల250గా నమోదైంది. చెన్నై మార్కెట్‌ని గమనిస్తే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1లక్ష44వేల610కి టచ్ అవ్వగా, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1లక్ష32వేల560 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఐటీ హబ్ బెంగళూరులో అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1లక్ష44వేల220గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష32వేల200 వద్ద కొనసాగుతోంది.

పుత్తడి మాత్రమే కాకుండా ఇంట్లో పూజలు, కానుకల కోసం సిల్వర్ ఐటెమ్స్ కొనాలనుకునే వారి చూపు కూడా ఇప్పుడు మార్కెట్ వైపే ఉంది. హైదరాబాదీ బులియన్ మార్కెట్‌లో ఈరోజు సిల్వర్ ధరలు కూడా పాత రేట్ల దగ్గరే నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల వెండి ధర రూ. 2,349గా ఉండగా, కిలో సిల్వర్ కావాలనుకునే వారికి ధర రూ. 2లక్షల34వేల900 వద్ద లభిస్తోంది.

Gold Price
Gold Price

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక పరిణామాలతో పాటు, అమెరికా డాలర్ మారకం విలువలో వస్తున్న అనుకోని మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావమే బంగారం, వెండి ధరలు పెరగడానికి, తగ్గడానికి కారణమవుతాయి. అలాగే మీరు కొనే ఆర్నమెంట్స్‌పై కచ్చితమైన హాల్‌మార్క్ స్టాంప్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దాంతో పాటు మీకిచ్చే ఫైనల్ బిల్లులో 3 శాతం జీఎస్టీతో పాటు, జ్యువెలరీ తయారీకి వేసే మేకింగ్ ఛార్జీలు అవీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి.

Mirror Response : మీరు ఎదుటివారి ముందు అద్దంలా ఉంటున్నారా? ఆటిట్యూడ్ చూపిస్తున్నారా?

Related Articles

Back to top button