Just LifestyleLatest News

Eco stays:ప్రకృతి ఒడిలో బస చేద్దామా.. తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ అగ్రో-టూరిజం స్పాట్స్ ఇవే..

Eco stays: తెల్లటి మేఘాల మధ్య, ఎత్తైన కొండల పైభాగంలో ఉన్న చెట్లపై నివసించడం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

Eco stays

యాంత్రిక జీవనంలో కొట్టుమిట్టాడుతున్న మనిషి ప్రశాంతత కోసం పరితపిస్తున్నాడు. రోజూ చూసే ట్రాఫిక్, ఆఫీస్ ఒత్తిడి, కాంక్రీట్ కట్టడాల మధ్య నలిగిపోతున్న మనసుకు, మనిషికి ప్రకృతి పలకరింపు ఒక గొప్ప ఊరట అని ఫీలవుతున్నాడు.

అందుకే ఇప్పుడు చాలామంది ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. లగ్జరీ హోటళ్లు, ఏసీ గదుల కంటే.. పచ్చని చెట్లపై ఇళ్లు (Tree Houses), పొలాల మధ్య మట్టి ఇళ్లు (Eco stays) వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. దీనినే అగ్రో-టూరిజం లేదా ఎకో-టూరిజం అని పిలుస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

Related Articles

ఎకో-స్టే(Eco stays) అంటే కేవలం ప్రకృతి ఒడిలో గడపడం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణమైన అనుభవం అని అనుకుంటున్నారు పర్యాటకులు. ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు వింటూ నిద్రలేవడం, పారే సెలయేరులో లేదా బావి దగ్గర చల్లటి నీళ్లతో స్నానం చేయడం, పొలాల్లో పండిన స్వచ్ఛమైన కూరగాయలతో వండిన భోజనాన్ని తినడం వంటి పనులకు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ మనల్ని మళ్లీ మన మూలాల్లోకి తీసుకెళ్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అరకు లోయలో ట్రీ హౌస్‌లు పర్యాటకులకు అందుకే స్వర్గధామంలా కనిపిస్తాయి. తెల్లటి మేఘాల మధ్య, ఎత్తైన కొండల పైభాగంలో ఉన్న చెట్లపై నివసించడం ప్రతీ ఒక్కరికీ మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. అలాగే, తూర్పు గోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో ఉన్న గిరిజన పల్లెలు, అగ్రో-ఫామ్స్ కూడా ఇప్పుడు పర్యాటకులకు పల్లెటూరి అందాలను కనువిందుగా చూపిస్తున్నాయి.

Eco stays
Eco stays

ఇక తెలంగాణ విషయానికి వస్తే, హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల, మొయినాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో చాలా అగ్రో-ఫామ్స్ వెలిశాయి. ఇక్కడ పర్యాటకులు స్వయంగా పొలాల్లోకి వెళ్లి కాయగూరలు కూడా కోసుకోవచ్చు, పశువులకు మేత వేయొచ్చు.

వికారాబాద్‌లోని అనంతగిరి కొండల సమీపంలో ఉన్న ఎకో-రిసార్ట్స్ పర్యాటకులకు.. అడవిలో ఉన్న అనుభూతినే కలిగిస్తాయి. ఇక్కడ బస చేయడం వల్ల కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాకుండా, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. మట్టితో కట్టిన ఇళ్లలో నివసించడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, నేచురల్ గాలి ఊపిరితిత్తులకు అందడం నిజంగానే అందరికీ మరపురాని అనుభూతి అవుతుంది.

కాబట్టి, ఈ వీకెండ్ప్రకృతికి దగ్గరగా గడపాలని అనుకున్నవారికి ఎకో-స్టే వెకేషన్స్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇవి మనల్ని ప్రకృతిని ప్రేమించేలా చేయడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ పట్ల కూడా అవగాహన కూడా కలిగిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button