Just LifestyleLatest News

Cat On The Wall Mentality : మీ సర్కిల్‌లో గోడ మీద పిల్లి ఉన్నారా? వారి బిహేవియర్ వెనుకున్న సైకాలజీ ఏంటి?

Cat On The Wall Mentality : ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారా? ఏ విషయంలో కూడా స్పష్టమైన స్టాండ్ తీసుకోలేని గోడ మీద పిల్లిలా ఎందుకుంటున్నారు? ఈ ఫెన్స్ సిట్టింగ్ మైండ్‌సెట్ వెనుకున్న రీజన్ ఏంటి?

Cat On The Wall Mentality

కొంతమంది మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు. ఎవరి దగ్గరకు వెళ్లి మాట్లాడితే వారి సైడే మాట్లాడుతూ ఉంటారు. అబ్బో వీళ్లు నాకు ఫేవర్‌గా మాట్లాడుతున్నారు..నాకే సపోర్ట్‌ అనుకునేలోగా వేరే వాళ్లతో డీప్ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ఇలా ఎవరినీ నొప్పించకూడదు.. ఏ గొడవలోనూ తలదూర్చకూడదు.. ఏ విషయంలోనూ కచ్చితమైన ఒపీనియన్ చెప్పకూడదని అనుకునే మైండ్ సెట్ మనుషులు చాలామందిలో కనిపిస్తుంటుంది.

చూడటానికి ఇది చాలా కూల్ అప్రోచ్ లాగా, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండే గొప్ప లక్షణంలాగా అనిపించొచ్చు. కానీ, లోతుగా పరిశీలిస్తే ఇది వారి పర్సనాలిటీని చంపేసే ఒక సైకలాజికల్ ట్రాప్ అంటారు మానసిక నిపుణులు. లైఫ్‌లో ఎప్పుడూ ఒక కాలు ఇటు, మరో కాలు అటు వేస్తూ గోడ మీద పిల్లిలా(Cat On The Wall Mentality) కాలం గడిపే మనుషుల మైండ్‌సెట్ వెనుక రీజన్స్ చాలా ఉంటాయని చెబుతున్నారు.

దీనిలో మొదటిది కాగ్నిటివ్ అవాయిడెన్స్ అంటే సమస్యలను ఎదుర్కోవడానికి భయపడటం. ఒక విషయంలో క్లారిటీగా మాట్లాడితే, దానికి వచ్చే పర్యవసానాలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ బాధ్యతను మోసే ధైర్యం లేక తనకేం సంబంధం లేదని తెలివిగా అని తప్పుకుంటారు.

అలాగే రెండోది ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటే తిరస్కార భయం. తాను ఒక అభిప్రాయం చెబితే అవతలివాడు తనను ఇష్టపడడేమో, తనతో దూరం పెడతాడేమోననే ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ వీరిలో చాలా ఉంటుంది. దీనివల్లే అందరి ముందు మంచివాడిగా పేరు తెచ్చుకోవాలనే ఆరాటంతో తన స్వంత గొంతును తానే నొక్కుకుంటాడు.

ఇక మూడోది డెసిషన్ పెరాలసిస్. ఒక దారిని ఎంచుకుంటే వేరే ఆప్షన్స్ మిస్ అయిపోతామేమోననే ఆందోళన బ్రెయిన్‌ను ఫ్రీజ్ చేస్తుంది. దీనివల్లే ఏ పక్షం గెలిస్తే ఆ వైపు దూకడానికి వీలుగా ఎప్పుడూ ఒక సేఫ్ జోన్‌ను క్రియేట్ చేసుకుంటారు. కానీ ఈ ట్రిక్ లైఫ్‌లో ఎక్కువ కాలం పనిచేయదు . వీరి మైండ్‌సెట్ ఏంటో కొన్నాళ్లకు అందరికీ అర్ధం అయి వీరిని దూరం పెట్టడం ప్రారంభిస్తారు.

అందరి పుస్తకాల్లోనూ మంచివాడు అనిపించుకోవాలని చేసే ఈ ప్రయాణంలో.. చివరికి వారికంటూ ఒక సొంత అడ్రస్, ఒక వ్యక్తిత్వం లేకుండా పోతుంది. చివరకు ఎవరూ కూడా వారిని నమ్మని, గౌరవించని దయనీయ స్థితిలోకి వెళ్లిపోతారు. ఎందుకంటే లైఫ్‌లో ఒక స్పష్టమైన స్టాండ్ లేనివాడికి, సొంత అస్తిత్వం(Existence) కూడా ఉండదని అందరికీ తెలిసిన విషయమే.

Relationship Needs : అవసరాల చుట్టూ తిరిగే మనుషులు.. ఈ ప్రవర్తన వెనుక ఉన్న సైకాలజీ సీక్రెట్

Related Articles

Back to top button