Biryani : సండే నాన్ వెజ్ క్రేజ్ ..బిర్యానీ వాసనతో ఊగిపోతున్న సిటీలు..
Biryani : ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు దాటిందంటే చాలు.. ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్లు కోట్లలో ప్లేస్ అయిపోతాయి. డెలివరీ బాయ్స్ అంతా రోడ్లపై రేస్ కార్లలా పోటీపడి మరీ తిరుగుతూ కనిపిస్తారు.
Biryani
మండే టు సాటర్డే వరకూ ప్రాజెక్ట్ డెడ్ లైన్లు, బాస్ తిట్లు, ఆఫీస్ మీటింగులతో బోర్ కొట్టేసిన ప్రతీ ఒక్కరికీ.. వారంలో దొరికే ఒకే ఒక్క రిలాక్స్ డే ఆదివారం. సండే అనగానే చాలామందికి నిద్ర, ఓటీటీ సిరీస్‌లు గుర్తొస్తాయేమో కానీ, పక్కా లోకల్ ఫుడీస్‌కు ముక్క మాత్రమే గుర్తుకువస్తుంది.
అవును ఆదివారం పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో గానీ, బయట గానీ నాన్ వెజ్ వాసన రాకపోతే అసలు సండే అన్న ఫీలింగే ఉండదంటారు నాన్ వెజ్ లవర్స్. అందులోనూ సిటీల్లో సండే వచ్చిందంటే చాలు, బిర్యానీ(Biryani) హోటల్స్ దగ్గర కనిపించే క్యూ లైన్లు నాన్ వెజ్ క్రేవింగ్స్‌ను మరింత పెంచేస్తాయి.
వారం అంతా జిమ్‌లు, డైటింగ్లు అంటూ సలాడ్లు, చపాతీలు తిని బోర్ కొట్టిన వారు కూడా సండే రాగానే క్యాలరీల లెక్కలన్నీ పక్కన పెట్టేస్తారు. ఈ ఒక్క రోజు తింటే ఏమైపోద్ది అంటూ చీట్ డే బోర్డు తగిలించేసి మరీ ప్లేట్ నిండా తమకు నచ్చిన ఎన్వీని వేయించుకుని లాగించేస్తుంటారు.
వారం రోజుల వర్క్ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ వేడివేడి రైస్‌తో, మసాలా దట్టించిన ముక్కను కలిపి తింటే మాయమైపోతుందనేది వాళ్ల గట్టి నమ్మకం. అందుకే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు దాటిందంటే చాలు.. ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్లు కోట్లలో ప్లేస్ అయిపోతాయి. డెలివరీ బాయ్స్ అంతా రోడ్లపై రేస్ కార్లలా పోటీపడి మరీ తిరుగుతూ కనిపిస్తారు.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం రోజు ముక్క చుక్క సెంటిమెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గల్లీ చివర ఉండే చికోన్, మటన్ షాపుల దగ్గర పొద్దున్నే ఆరు గంటలకే జనాలు క్యూ కడతారు. ఇంట్లో అమ్మ చేసే ఘాటైన కోడి కూర,బిర్యానీ, గారెలు ఒక ఎత్తయితే.. బ్యాచిలర్స్ రూమ్స్‌లో ఫ్రెండ్స్ అంతా కలిసి చేసుకునే సండే వంటల హడావుడి ఇంకో ఎత్తు.

ఎవరు ఏం తేవాలి, చికెన్ ఎవరు కడగాలి, వంట ఎవరు చేయాలనేదానిపై పెద్ద చర్చలే జరుగుతాయి. చివర్లో అంతా కలిసి ఆ ముక్క-చుక్క కాంబినేషన్‌తో ఆదివారాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేసి, మత్తుగా ఒక నిద్ర తీస్తే వచ్చే కిక్కే వేరు అంటూ సండేను స్పెషల్ డేగా మలుచుకుంటారు.
మొత్తంగా నాన్ వెజ్, బిర్యానీ(Biryani) అనేది మనకు కేవలం ఒక ఫుడ్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. వారం రోజుల పాటు పడిన కష్టాన్ని మర్చిపోయి, మూడ్‌ను, బాడీని రిలాక్స్ చేసుకోవడానికి చాలామంది వెతుక్కునే ఒక రుచికరమైన షెల్టర్ ఇది. అందుకే డైటింగ్లు, కంట్రోల్స్ అన్నీ పక్కన పెట్టేసి.. ఈ సండేని కూడా వేడివేడి బిర్యానీతో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి.
Gold Rates : ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? గోల్డ్ రేట్ తగ్గిందా? పెరిగిందా?





