Just LifestyleLatest News

Children’s Day : చిల్డ్రన్స్ డే స్పెషల్.. వందసార్లు వద్దు అన్నా చెదరని చిరునవ్వును నేర్పిద్దాం..

Children's Day : పిల్లలకు కేవలం గెలవడం ఒక్కటే కాదు.. ఓటమి ఎదురైనప్పుడు తిరిగి లేచే ధైర్యాన్ని ఎలా నేర్పించాలి? నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన నిజం ఇది.

Children’s Day

మనమంతా మన పిల్లలను ఎలా పెంచుతున్నాము. హడావుడిగా స్కూల్‌కి పంపడం, ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవాలని ఒత్తిడి చేయడం, క్లాస్‌లో ఎవరైనా ఫస్ట్ వస్తే వాడితో పోల్చి తిట్టడం ఇదే చేస్తుంటాం..చూస్తుంటాం. కానీ నవంబర్ 14 చిల్డ్రన్స్ డే(Children’s Day) రోజు మనమంతా నిజంగా ఆలోచించాల్సిన విషయం వేరే ఉంది. ప్రతీ పిల్లలకు గెలుపు మంత్రాలు నేర్పిస్తున్నాం. అయితే ఆ గెలిచే దారిలో దెబ్బ తగిలి పడిపోయినప్పుడు ఎలా లేవాలో నేర్పుతున్నామా అన్నదే ప్రశ్న. నిజానికి అసలు అసలైన లెసన్ అక్కడే ఉంది.

దీనికి ఓ రియల్ సంఘటనను ఉదాహరణగా చెప్పుకుంటే.. అమెరికాలోని బోస్టన్‌‌లో జరిగిన ఓ చిన్న సంఘటన గురించే ముందు తెలుసుకోవాలి. ఓ స్టోర్ బయట ఐదేళ్ల బాబు మెడలో బోర్డు వేసుకుని నిలబడ్డాడు. ఆ చిన్నారి చేతిరాతతో.. స్కౌట్ ఛారిటీ కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనండి.. కేవలం 20 డాలర్లు అని రాసి ఉంది.

జనాలు ఎవరి దారిన వారు బిజీగా ఆ చిన్నారిని కనీసం చూడకుండానే వెళ్లిపోతున్నారు. మరికొందరు వద్దు బాబూ అని ముఖం తిప్పుకుంటున్నారు. జనరల్‌గా అయితే మనం చూసే పిల్లలు ఇన్నిసార్లు వద్దనే రిజెక్షన్ వింటే మూలన కూర్చుని ఏడుస్తారు. కానీ ఆ బాబు అలా చేయలేదు.

ప్రతీ నో అన్న వర్డ్ విన్న తర్వాత మరింత స్మైల్‌తో మరో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. అంతే తప్ప ఫేస్‌లో ఏమాత్రం భయం గానీ, నిరాశ గానీ కనిపించ లేదు. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఆశ్చర్యపోయిన ఓ వ్యక్తి బాబు దగ్గరకు వెళ్లి.. ఇంత చలిలో ఇంకా ఎన్ని అమ్మాలి నువ్వు అని అడిగాడు. దానికి ఆ బుజ్జోడు వంద మంది వద్దు అని చెప్పేంత వరకు అని ముద్దుగా ఇచ్చిన ఆన్సర్‌ విని అతని మైండ్‌ బ్లాంక్ అయిపోయింది.

దీంతో అక్కడే ఉన్న బాబు స్కూల్ టీచర్ అసలు సీక్రెట్‌ను రివీల్ చేశాడు. తాము వీళ్లకు బిస్కెట్లు అమ్మడం నేర్పించడం లేదని.. చిన్న వయసులోనే వద్దనే రిజక్షన్‌ను ఎలా ఫేస్ చేయాలో నేర్పుతున్నామని .. ఎవరైనా నో అంటే కుంగిపోకుండా, నవ్వుతూ నెక్స్ట్ స్టెప్ వేసే ధైర్యాన్ని అలవాటు చేస్తున్నామని చెప్పారు.

ఇదే పాయింట్ మన ఇండియన్స్ దగ్గర బాగా మిస్ అవుతోంది. మన పిల్లలు ఎగ్జామ్‌లో ఫెయిలయితే చాలు.. అందరూ పాస్ అయ్యారు.. నువ్వే వేస్ట్ అని మన నోళ్లతోనే వాళ్ల కాన్ఫిడెన్స్‌ను గొంతు నులిమి చంపేస్తున్నాం. ఆ పసివాడి గుండెల్లో తెలీకుండా మరో ఓటమిని బలంగా గుచ్చేస్తున్నాం.

కాబట్టి ఈ చిల్డ్రన్స్ డే(Children’s Day)కి మన పిల్లల కోసం మనం రూట్ మారుద్దాం. లైఫ్ అంటేనే కేవలం గెలుపుల పూలబాట కాదు.. మధ్యలో ముళ్లు కూడా తగులుతాయన్నది తెలియజేయాలి. పెద్దయ్యాక ఇంటర్వ్యూలలో ఫెయిల్యూర్స్, బిజినెస్‌లో లాస్‌లు, రిలేషన్స్‌లో బ్రేకప్స్.. ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఆ నో అనే మాటను చూసి భయపించడం కాదు, దాని నుంచే బలాన్ని పుంజుకోవడం నేర్పించాలి.

ఈరోజు(Children’s Day) నుంచి మన పిల్లలతో మార్కుల గురించి అడగడం ఆపేద్దాం. నువ్వు బెస్ట్ ట్రై చేశావు కదా ..నాకదే చాలు. ఈసారి పోతే మళ్లీ ట్రై చేద్దాం, నీకు నేనున్నానని భుజం తట్టి చూడండి. ఆ పిల్లలు క్లాస్ రూమ్‌లో గెలిచినా ఓడినా.. జీవితంలో మాత్రం ఎప్పటికీ కిందపడిపోరు. మన పిల్లలకు మనమివ్వగలిగే మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ఏంటంటే.. ఓడిపోయినా సరే వెనకడుగు వేయకుండా మళ్లీ నిలబడగల ఆ అజేయమైన ఆత్మవిశ్వాసమే అన్నది ముందు మనం నేర్చుకుందాం.

Women Midlife Crisis : 45 ప్లస్ మహిళలు అటెన్షన్ ఎందుకు కోరుకుంటారు? మిడ్ లైఫ్ క్రైసిస్, ఫ్రీడమ్ ఆలోచనల మధ్య వారి లైఫ్ స్టైల్..

Related Articles

Back to top button