Just LifestyleLatest News

Live for Yourself: లోకం మెచ్చే బతుకు కాదు.. నీ కోసం నువ్వు జీవించడం మర్చిపోకు

Live for Yourself : కొంతమంది తమ నిర్ణయాలను సొంతంగా కాకుండా, పక్కనున్న వారు ఏమనుకుంటారో అనే భయంతో తీసుకుంటుంటారు.

Live for Yourself

మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ దీని ఆచరణ మాత్రం ఇతరుల చేతిలో పెడతారు కొంతమంది. తమ నిర్ణయాలను సొంతంగా కాకుండా, పక్కనున్న వారు ఏమనుకుంటారో అనే భయంతో తీసుకుంటుంటారు.

ఈ అలవాటు మొదట్లో మనందరికీ చాలా చిన్నదిగా అనిపించినా, మెల్లమెల్లగా అది మన అసలైన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మింగేస్తుంది. ఇతరుల మెప్పు కోసం, అలాగే వారి అంచనాల కోసం బతికే వ్యక్తి(Live for Yourself)..ముందు ముందు తన లోపల ఉన్న నిజమైన కోరికలను, ఇష్టాలను గొంతు నొక్కి చంపేసే పరిస్థితులు వస్తాయి.

మనం చేసే ప్రతి పనిలో కూడా ఇది వాళ్లకు నచ్చుతుందా? వీళ్లు ఏమైనా అనుకుంటారా? అనే ఆలోచన కనిపిస్తుంది తప్ప, ఇది నాకు ఇష్టమా అనే క్లారిటీ వారికే ఉండదు. ఒకవేళ మీరూ కూడా ఇలాగే జీవిస్తున్నారంటే మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టేసారనే అర్ధం.

సాధారణంగా ఇలాంటి మనస్తత్వానికి చెందిన వ్యక్తులు అందరినీ సంతోషపెట్టాలని చూస్తుంటారు. వారికి సాధ్యం కాకపోయినా కూడా ఎవరికీ లేదు, కాదు అని చెప్పలేరు. ఎందుకంటే అవతలి వారు నిరాశ చెందుతారేమోననే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది(Live for Yourself). బయటి నుంచి చూస్తే వీరు అందరితో బాగా కలిసిపోయే మంచి వ్యక్తుల్లా కనిపిస్తారు కానీ, వీరు మాత్రం లోపలలోపల చాలా ఒత్తిడి, తీవ్రమైన అసంతృప్తితో నలిగిపోతుంటారు.

ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడే జీవితం ఒకానొక దశలో వారి జీవితం అంతా చాలా శూన్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలతో సాగిన ఆ ప్రయాణంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండదు, తన విలువల కంటే సమాజం ఇచ్చే సర్టిఫికెట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దీనివల్ల వారికున్న కాన్ఫిడెన్స్ అట్టడుగుకి పడిపోయి, తాను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేననే నైరాశ్యంలోకి జారిపోతారు.

అయితే, ఏదో ఒక సందర్భంలో ఇలాంటివారి మనసు గట్టిగా తిరగబడుతుంది. ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయినప్పుడో , తనకు ప్రాణప్రదమైన విషయాన్ని, వస్తువును వదిలేయాల్సి వచ్చినప్పుడో.. వీరిలో ఒక క్లారిటీ వస్తుంది. ఇన్నాళ్లు ఇతరుల కోసం జీవించి తన జీవితాన్ని ఎలా పోగొట్టుకున్నారో అనే నిజాన్ని గ్రహించినప్పుడు వారిలో మార్పు మొదలవుతుంది(Live for Yourself).

Live for Yourself
Live for Yourself

నిజం చెప్పాలాంటే అక్కడి నుంచి అయినా తమ అసలైన ప్రయాణం ప్రారంభం కావాలని వారికి వారే అర్ధం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో మనసు మాట వినడం నేర్చుకోవాలి. లోకం ఏమనుకుంటుందనే భయం , అనుమానం కంటే మనకు ఇది తృప్తిని ఇస్తుందా? అనే ధైర్యం ముఖ్యం అన్న విషయాన్ని తెలుసుకోవాలి.

ఇక్కడే ఒక విషయం మనం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిజానికి ఈ లోకంలో అందరినీ సంతోషపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు.. కానీ మనల్ని మనం అర్థం చేసుకుని జీవించడం మాత్రం కేవలం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు మన విలువలని ప్రతిబింబించాలి తప్ప, ఎదుటివారి అంచనాలని కాదన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలి.

Kohli : ఇదిరా కింగ్ కోహ్లీ అంటే..చిన్నస్వామిలో కళాత్మక విధ్వంసం

Related Articles

Back to top button