Just SportsLatest News

Kohli : ఇదిరా కింగ్ కోహ్లీ అంటే..చిన్నస్వామిలో కళాత్మక విధ్వంసం

Kohli : విరాట్ కోహ్లీ... ప్రపంచ క్రికెట్ లో సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ బ్యాటింగ్ ను ఏళ్ల తరబడి అభిమానులు చూస్తూనే ఉన్నారు

Kohli

క్రికెట్ లో తరచుగా వినిపించే మాట… ఫామ్ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈజ్ పర్మినెంట్… టెస్ట్, వన్డే, టీ20 ఏ ఫార్మాట్ అయినా కూడా క్లాసిక్ గా బ్యాటింగ్ చేయడం అందరి వల్లా కాదు. మీరు నాటుగా పరమ నాటుగా బ్యాటింగ్ చేసే వాళ్లను టీ20 ఫార్మాట్ లో చూడొచ్చు. కానీ క్లాస్ గా తెలుగులో చెప్పాలంటే కళాత్మక విధ్వంసాన్ని కొందరు బ్యాటర్లలోనే చూస్తుంటాం.

ఈ జాబితాలో ప్రస్తుత తరంలో ఎప్పుడూ ముందుండే పేరు విరాట్ కోహ్లీ(Kohli)… ప్రపంచ క్రికెట్ లో సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ(Kohli) బ్యాటింగ్ ను ఏళ్ల తరబడి అభిమానులు చూస్తూనే ఉన్నారు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్ లో టెస్ట్, టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన కోహ్లీ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

అయితే ఐపీఎల్ లోనూ దుమ్మురేపుతున్నాడు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్ ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా ఆరంభించింది. హోంగ్రౌండ్ లో సన్ రైజర్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ ఎప్పటిలానే అద్భుతమైన బ్యాటింగ్ అదరగొట్టేశాడు.

అయితే ఈ సారి క్లాస్ బ్యాటింగ్ తో చిన్నస్వామి స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఎవరైనా కోపంగా కొడతాడు.. బలంగా కొడతాడు.. కానీ కోహ్లీ(Kohli) మాత్రం చాలా శ్రద్ధగా కొట్టాడు..దానినే క్లాసిక్ బ్యాటింగ్ అంటారు.. క్రికెట్ లో ఎన్ని ఫార్మాట్ లు వచ్చినా క్లాసికల్ బ్యాటింగ్ కు ఉండే ఎట్రాక్షనే వేరు. తనలోని ఆట ఇంకా తగ్గలేదని వింటేజ్ బ్యాటింగ్ తో అందరికీ చూపించాడు.

Kohli
Kohli

టీ20 ఫార్మాట్ లో విధ్వంసకర బ్యాటింగ్ ఎవరైనా ఆడతారు. అయితే ఆ విధ్వంసానికి క్లాస్ షాట్లు తోడైతే దానిని అసలైన ఉదాహరణ శనివారం కోహ్లీ ఆడిన ఇన్నింగ్సే.. మిడ్ వికెట్, లాంగాఫ్ , లాంగాన్… స్టెయిట్ డ్రైవ్… అన్ని వైపులా కళాత్మక షాట్లతో అలరించాడు. నిజానికి కోహ్లీ ఆరంభంలో 10 బంతుల వరకూ కాస్త నిదానంగానే ఆడాడు. అయితే పడిక్కల్ ఔటైన తర్వాత గేర్ మార్చాడు. 38 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

విరాట్ దెబ్బకు ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే ఆర్సీబీ టార్గెట్ అందుకుంది. నిజానికి రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ ఆట మరో స్థాయికి చేరిందా అనిపిస్తోంది. అందుకే విరాట్ ను టెస్టుల్లోకి తిరిగి రావాలంటూ కోరుతున్నారు. ఏది ఏమైనా తన వింటేజ్ బ్యాటింగ్ తో ఐపీఎల్ 2026ను ఘనంగా మొదలుపెట్టిన కింగ్ కోహ్లీ మరోసారి ఆరెంజ్ క్యాప్ పై కన్నేశాడంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Bedtime Snack:వెయిట్ తగ్గాలనుకునేవారికి బెడ్ టైం స్నాక్ ..తయారీ కూడా చాలా సింపుల్

Related Articles

Back to top button