Just LifestyleLatest News

Ego In Relationship : బంధంలో ఈగో అడ్డుగోడ వేస్తోందా? స్పందన లేని భాగస్వామితో ముందడుగు వేయొచ్చా?

Ego In Relationship : గొడవ వచ్చిన ప్రతిసారీ తన ఈగోనే ముఖ్యమనుకుని, తగ్గడానికి అస్సలు ఇష్టపడకపోవడమనేది ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీకి సంకేతం.

Ego In Relationship

ప్రేమికులలో అయినా దంపతులలో అయినా గొడవలు రావడం సహజం. అయితే అంతా బాగున్నంత సేపు నీ తర్వాతే ప్రపంచం అని మాట్లాడే పార్ట్‌నర్.. గొడవ జరిగాక మెట్టు దిగడానికి ముందుకు రాకపోవడం చాలా దగ్గర చూస్తుంటాం. తన తప్పుతోనే ఇద్దరి మధ్య తేడా వచ్చినా కూడా ఇలా ఈగో చూపించే పార్ట్‌నర్స్‌ చాలామందే ఉంటారు.

అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తూ, గొడవ వచ్చినపుడో, అవసరం వచ్చినపుడో అందుబాటులో లేకపోతే వారి మాటల్లో ఉన్నది నిజమైన ప్రేమ కాకపోవచ్చని సైకాలజిస్ట్‌లు అంటున్నారు. అది కేవలం ఒక ఆకర్షణ లేదంటే తమ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వాడుకోవడం అయి ఉండొచ్చని అంటున్నారు.

ఏ బంధంలోనైనా గొడవలు వచ్చినపుడు ఎవరు తగ్గారన్నది కూడా ఇంపార్టెంట్. ఎవరు గెలిచారనే దానికంటే ఆ బంధం నిలవాలని ఆలోచించేవారే నిజమైన పార్ట్‌నర్. గొడవ వచ్చిన ప్రతిసారీ తన ఈగోనే ముఖ్యమనుకుని, తగ్గడానికి అస్సలు ఇష్టపడకపోవడమనేది ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీకి (Emotional Immaturity) సంకేతం.

తప్పు ఎవరిదైనా సరే, రిలేషన్ కోసం తగ్గే గుణం అవతలివారిలో లేనప్పుడు, భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద సమస్యల్లో వారు తమ పార్ట్‌నర్‌ తోడుగా నిలబడతారని ఆశించడం కష్టమే అవుతుంది. వీరు ముందు ముందు మారతారని ఆశించడం కూడా పొరపాటే. ఎందుకంటే మనుషులు ఎవరైనా సరే అంత ఈజీగా మారిపోరు.

అందుకే మాటల కంటే కూడా వారి ప్రవర్తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. వారు చెప్పే మాటలను కాకుండా మీరు లేనప్పుడు, లేదా మీకు అవసరమైనప్పుడు వారెలా ప్రవర్తిస్తున్నారు అనేది గమనించాలి.

Ego In Relationship
Ego In Relationship

ఒకవేళ మీరిప్పటికే ఇలాంటి బంధంలో ఉంటే.. గొడవ సద్దుమణిగాక ఈ విషయంపై వారితో సూటిగా, మాట్లాడండి. వారి మాటల్లో ఉన్న ప్రేమ ప్రవర్తనలో కనిపించడం లేదని.. గొడవలు వచ్చినప్పుడు వారు చూపిస్తున్న వైఖరి చాలా బాధపెడుతోందని క్లియర్‌గా చెప్పండి.

ఆ తర్వాత కూడా పార్ట్‌నర్‌లో ఎలాంటి చేంజ్ రాకపోతే, సెల్ఫ్ రెస్పెక్ట్‌ను , మెంటల్ పీస్‌ని పణంగా పెట్టి ఆ బంధంలో కొనసాగాలా వద్దా అనేది సీరియస్‌గా ఆలోచించుకోవాలి. లైఫ్‌లో ఎప్పుడైనా సరే.. మాటలతో మేడలు కట్టే వారి కంటే,పక్కన నిలబడి ఆప్యాయత చూపించేవారే కావాలి. బంధంలో ఒకరే పదే పదే దిగి రావడమన్నది హెల్దీ రిలేషన్‌షిప్ అనిపించుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

AI Consume Water : 80s ఏఐ ఇమేజ్ వెనుకున్న చేదు నిజం.. ఒక్క ఫోటో ఏఐ సర్వర్లకు ఎంత దాహాన్ని పెంచుతోందో తెలుసా?

Related Articles

Back to top button