Just LifestyleLatest News

Free Education : చెత్త ఇస్తే చదువు చెప్తారు.. ప్లాస్టిక్ వ్యర్థాలే స్కూల్ ఫీజు ఎక్కడో తెలుసా?

: ఇక్కడ కేవలం చదువు మాత్రమే చెప్పరు. గార్డెనింగ్, కార్పెంట్రీ, సోలార్ టెక్నాలజీ వంటి ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ను నేర్పిస్తారు.

Free Education

జనరల్‌గా ఏ స్కూల్‌కి వెళ్లి అడిగినా.. అడ్మిషన్ల దగ్గర నుంచి టర్మ్ ఫీజుల వరకు వేలకు వేలు, లక్షలు చెల్లించాల్సిందేనని చెప్పడం వింటాం. ఫీజు కట్టడం కాస్త లేటయినా కూడా పిల్లలను క్లాసు బయట నిలబెట్టడం చూస్తుంటాం. కానీ, పేరెంట్స్ దగ్గర పైసా లేకపోయినా పర్లేదు, వారి ఇంట్లో కేవలం ప్లాస్టిక్ చెత్త ఉంటే చాలు.. పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్‌ను అందిస్తున్న స్కూలు ఉందన్న విషయం చాలామందికి తెలీదు.

వినడానికి ఏదో సినిమా స్టోరీలా అనిపించినా, ఇది హండ్రెడ్ పర్సంట్ నిజం. అక్షరాలా ప్లాస్టిక్ వ్యర్థాలనే తమ స్కూల్ ఫీజుగా మార్చి దేశవ్యాప్తంగా అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది మన దేశంలోని ఒక చిన్న స్కూలు అంటేనే చాలామంది ఆశ్చర్యపోతారు.

అసోం రాష్ట్రంలోని గువాహటి దగ్గరలో ఉన్న పమోహి అనే ఊరిలో అక్షర్ స్కూల్ (Akshar School) ఉంది. దంపతులయిన పర్మితా శర్మ, మజిన్ ముఖ్తార్ 2016లోనే ఈ అద్భుతమైన ఐడియాకి శ్రీకారం చుట్టారు. ఆ ప్రాంతంలో పేదరికం వల్ల పిల్లలను బడికి పంపించకుండా క్వారీల్లో పనులకు పంపించేవారు.

అలాగే ఆ ఊరిలో ఇళ్లలో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తనంతా రోడ్లపైనే పడేసి తగలేసేవారు. ప్లాస్టిక్ కాలడం వల్ల వచ్చే విషపూరిత పొగ ఊరంతా కప్పేసేది. ఈ రెండు పెద్ద సమస్యలకు ఒకేసారి చెక్ పెట్టాలని ఆలోచించిన ఆ దంపతులు, ప్లాస్టిక్‌నే స్కూల్ ఫీజుగా మార్చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.కాకపోతే ప్లాస్టిక్‌ను తగలేయబోమని పిల్లలను జాయిన్ చేసే ముందు ఆ పేరెంట్స్ నుంచి హామీ మాత్రం కచ్చితంగా తీసుకుంటారు.

ఈ స్కూల్లో చదివే పిల్లలు ప్రతి వీక్ కూడా తమ ఇళ్లలో, చుట్టుపక్కల దొరికే పొడి ప్లాస్టిక్ వేస్ట్‌ను సేకరించి స్కూలుకు తీసుకురావాలి. వారానికి దాదాపు 10 నుంచి 25 వరకు ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్లు ఫీజుగా కడితే చాలు. దీనివల్ల పేరెంట్స్‌కు పైసా ఖర్చు ఉండదు. అలాగే ఊరి నిండా ప్లాస్టిక్ చెత్త లేకుండా క్లీన్‌గా మారుతుంది.

ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను ఊరికే పడేయరు. ప్లాస్టిక్ బాటిళ్లలో కవర్లన్నింటిని గట్టిగా కుక్కి.. ఎకో-బ్రిక్స్ (Eco-bricks) తయారు చేస్తారు. అంటే ప్లాస్టిక్ ఇటుకలు అన్నమాట. వీటిని స్కూల్లో చిన్న చిన్న నిర్మాణాలను తయారు చేయడానికి, మార్గాలు నిర్మించడానికి వాడుతుంటారు. దీంతో చెత్తగా భావించిన దాన్ని ఒక వనరుగా మార్చే విధానాన్ని పిల్లలు స్వయంగా నేర్చుకున్నట్లు కూడా అవుతుంది.

అంతేకాదు, ఇక్కడ కేవలం బుక్స్ చదువు మాత్రమే చెప్పరు. గార్డెనింగ్, కార్పెంట్రీ, సోలార్ టెక్నాలజీ వంటి ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ను నేర్పిస్తారు. ఈ స్కూలులో మరో క్రేజీ కాన్సెప్ట్ కూడా ఉంది. పెద్ద తరగతి పిల్లలే చిన్న తరగతి పిల్లలకు లెసన్స్ చెప్తారు. దీనివల్ల వారికి లీడర్‌షిప్ క్వాలిటీస్ రావడంతో పాటు వారి చదువు చాలా ఈజీగా రివైజ్ అవుతున్నట్లు అవుతుంది. ఇలా టీచర్ అవతారం ఎత్తినందుకు వారికి చిన్న పాటి పారితోషికం కూడా ఇస్తారు.

Free Education
Free Education

బాలకార్మికులుగా మారాల్సిన పిల్లలందరినీ ఇలా బడిబాట పట్టించడమే కాక, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ప్రాక్టికల్‌గా నేర్పిస్తున్న ఈ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంటోంది. అసోం గవర్నమెంట్ కూడా తమ సస్టెయినబిలిటీ రిపోర్ట్స్‌లో ఈ స్కూల్ పేరును చాలా స్పెషల్‌గా ప్రస్తావించింది.

ఒక మంచి ఆలోచన ఉంటే చాలు, చెత్తతో కూడా సొసైటీలో విప్లవాత్మక మార్పులు తేవొచ్చని ఈ అక్షర్ స్కూల్ ప్రూవ్ చేసింది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ చదువునందించే ఈ విధానం నిజంగానే ఎంతోమందికి రోల్ మోడల్‌ అవుతుంది.

Weight Gain : వెయిట్ తగ్గడం ఓకే మళ్లీ పెరగడమే పెద్ద సమస్య.. కానీ ఆ తప్పు మీది కాదు మీ బ్రెయిన్‌ది..

Related Articles

Back to top button