Just LifestyleLatest News

Gen Z Love : కమిట్‌మెంట్ భయమా లేక ఆప్షన్ల మాయా?..జెన్ జీ లవ్ సైకాలజీ ఏంటి?

Gen Z Love : సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు వాడేవారు పెరిగిన కొద్దీ మనుషుల ఎమోషన్స్ కూడా స్క్రీన్ల మీదే ప్లే అవ్వడం మొదలయ్యాయి.

Gen Z Love

మామూలుగా ఒకరిని ఇష్టపడితే ఆ విషయాన్ని వారికి డైరెక్టుగా చెప్పడం, ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ వారిద్దరూ తోడుగా ఉండటం జరుగుతాయి. కానీ జెన్ జీ వరల్డ్‌లో లవ్(Gen Z Love) అనేది చాలా డిఫరెంట్‌గా మారిపోయింది. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు వాడేవారు పెరిగిన కొద్దీ మనుషుల ఎమోషన్స్ కూడా స్క్రీన్ల మీదే ప్లే అవ్వడం మొదలయ్యాయి.

ఒకరితో రిలేషన్‌లో ఉంటూనే దానికి ఎలాంటి పేరు పెట్టకపోవడం, బంధంలో ఉంటూ సడన్‌గా మాయమైపోవడం, లవ్ చేస్తున్నామని చెబుతూనే పక్కన ఇంకొకరిని ఆప్షన్‌గా పెట్టుకోవడం వంటి విచిత్రమైన ప్రవర్తనలు జెన్ జీలలో ఎక్కువగా కనిపిస్తోంది.జెన్ జీ కల్చర్‌లో ఎక్కువగా వినిపించే సిట్యువేషన్‌షిప్ అనేది పూర్తిగా కమిట్‌మెంట్ భయం (Fear of Commitment) బేస్ మీద పనిచేస్తుంది.

సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం, ఒకరితో ఎమోషనల్‌గా లోతుగా కనెక్ట్ అయితే ఫ్యూచర్‌లో హార్ట్ బ్రేక్(Heartbreak) తప్పదేమోననే మెంటల్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల, అలాగే రెస్పాన్సిబిలిటీ భయంతో .. చాలామంది బాధ్యతలు లేని టెంపరరీ రిలేషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలాంటివి ఒక విధంగా తమను తాము కాపాడుకోవడానికి వారి మైండ్ వేసుకునే డిఫెన్స్ మెకానిజం అవుతుంది. ఇక్కడ ఇంటిమసీ ఉంటుంది కానీ ఎమోషనల్ సెక్యూరిటీ ఉండదు.

అలాగే రిలేషన్‌షిప్ మధ్యలో సడన్‌గా మాయమైపోయే ఘోస్టింగ్ మెంటాలిటీ వెనుక కమ్యూనికేషన్ పట్ల ఉన్న భయం , బాధ్యతారాహిత్యం కనిపిస్తాయి. ఎదుటి వ్యక్తికి నచ్చలేదని లేదంటే రిలేషన్‌షిప్ ఆపేద్దామని డైరెక్టుగా చెప్పే ధైర్యం లేనివారు, ఆ మెంటల్ టెన్షన్‌ను ఫేస్ చేయలేక డిజిటల్‌గా బ్లాక్ చేసి పారిపోతారు. సైకలాజికల్ రిసెర్చ్ ప్రకారం ..దీనిలో ఇలాంటి ఘోస్టింగ్‌కు గురైన పార్ట్‌నర్ మాత్రం వారి వల్ల తీవ్రమైన ఆందోళన, తన మీద తనకే నమ్మకం పోవడం వంటి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తారు.

జెన్ జీలలో కనిపించే మరొక మెయిన్ మైండ్ గేమ్ బ్రెడ్‌క్రంబింగ్ లేదా బెంచింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. తమకు క్లియర్ ఇంటెన్షన్ లేకపోయినా, ఎదుటివారిని పూర్తిగా వదులుకోకుండా అప్పుడప్పుడు వారికి చిన్న చిన్న మెసేజ్‌లు వేస్తూ ఆశలు చూపించడాన్ని బ్రెడ్‌క్రంబింగ్ అంటారు.

Gen Z Love
Gen Z Love

ఇక్కడ తమ ఈగోను శాటిస్ఫై చేసుకోవడానికి , తమకు అందరిలో డిమాండ్ ఉందనే ఫీలింగ్ కోసం ఒక మనిషి ఎమోషన్స్‌ను పక్కన పెట్టి వారి ఫీలింగ్స్‌ను వాడుకుంటారు. అలాగే బెంచింగ్‌లో ఒకరితో డేటింగ్ చేస్తూనే ఉంటారు. కానీ వారికంటే మెరుగైన ఆప్షన్ దొరుకుతుందేమోనని వెతుకుతుంటారు. దీనికి ఆప్షన్స్ సిండ్రోమ్ పనిచేస్తుంది.

ఇటువంటి మెంటాలిటీ, కల్చర్ పెరగడానికి మెయిన్ రీజన్ ఆప్షన్లు ఎక్కువగా పెరిగిపోవడం , మనుషులను ఒక వస్తువులా చూసే వైఖరి పెరగడమే అని సైకాలజిస్టులు అంటున్నారు. డేటింగ్ యాప్‌లో ఒక్క స్వైప్‌తో కొత్త పార్ట్‌నర్ ఈజీగా దొరికేస్తుండటంతో ఒకరిపైనే దృష్టి పెట్టే శ్రద్ధ , ఓపిక మెల్లగా తగ్గిపోతున్నాయి.

అయితే పైకి చాలా కూల్‌గా, ట్రెండీగా కనిపించే ఈ జెన్ జీ డేటింగ్ కల్చర్ వల్ల.. వారి మనసు లోపల ఒంటరితనంతో పాటు, ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్‌ పెరిగి మానసికంగా ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

Breakup Pain : బ్రేకప్ పెయిన్ తగ్గడం లేదా? ఫేక్ ఐడీలతో మాజీలను ట్రాక్ చేస్తున్నారా?

Related Articles

Back to top button