Just Lifestylejust AnalysisLatest News

IMD : వానలొచ్చేస్తున్నాయ్..నైరుతి రుతుపవనాల అప్‌డేట్

IMD : ముఖ్యంగా కేరళలో మాత్రం వానల జోరు ఎక్కువగా ఉండబోతోందని ఐఎండీ అంచనా వేస్తుంది. అక్కడ కొన్ని ఏరియాల్లో 7 సెంటీమీటర్ల నుంచి ఏకంగా 20 సెంటీమీటర్ల దాకా భారీ వర్షపాతం రికార్డయ్యేలా కనిపిస్తోంది.

IMD

గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండల దెబ్బకు అల్లాడిపోతున్న.. దేశ ప్రజలకు వాతావరణ శాఖ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. అందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీకల్లా కేరళ తీరాన్ని తాకడానికి గట్టిగా రెడీ అవుతున్నాయి.

కొద్దిగా ఆలస్యమైనా సరే రుతుపవనాలు కేరళలో అడుగుపెట్టడమే ఆలస్యం.. దేశంలో వానాకాలం స్టార్ట్ అయిపోయినట్లే లెక్క అవుతోంది. ఈ రుతుపవనాల కదలికల వల్ల రాబోయే 6 నుంచి 7 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని .. చాలా రాష్ట్రాల్లో వానలు దంచికొట్టే ఛాన్స్ ఉందని ఐఎండీ(IMD) అధికారులు చెబుతున్నారు

ముఖ్యంగా కేరళలో మాత్రం వానల జోరు ఎక్కువగా ఉండబోతోందని ఐఎండీ(IMD) అంచనా వేస్తుంది. అక్కడ కొన్ని ఏరియాల్లో 7 సెంటీమీటర్ల నుంచి ఏకంగా 20 సెంటీమీటర్ల దాకా భారీ వర్షపాతం రికార్డయ్యేలా కనిపిస్తోంది.

అరేబియా సముద్రం మీదుగా వస్తున్న తేమ గాలులు బాగా బలంగా అవ్వడంతో రుతుపవనాలు వేగమందుకున్నాయి. దీని ప్రభావం కేరళతో పాటు పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలపై కూడా గట్టిగా పడనుంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడేలా మేఘాలు కమ్ముకుంటున్నాయి.

అయితే ఈ వర్షాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేలా ఉన్నాయని వాతావారణశాఖ చెబుతోంది. దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్ప ఏరియాల్లో పిడుగులు పడే ప్రమాదముందంటూ అధికారులు అలర్ట్ జారీ చేశారు.

వాన పడే టైమ్‌లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్‌తో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల వల్ల కరెంట్ స్తంభాలు, షెడ్లు కూలిపోయే ప్రమాదం ఉంది, అంతేకాదు చేతికొచ్చిన పంటలు కూడా దెబ్బతినొచ్చు. అందుకే ప్రజలంతా కాస్త జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ శాఖ అధికారులు చెప్పే గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు.

మరోవైపు కొన్ని రోజులుగా ఎండలతో నరకం చూసిన ఉత్తరాది రాష్ట్రాలకు ఈ వానలు పెద్ద రిలీఫ్ ఇవ్వబోతున్నాయి. ఢిల్లీ – ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలలో ఇప్పటికే ఎండలు తగ్గి ఉష్ణోగ్రతలు నార్మల్‌కు వచ్చాయి.

రాబోయే రోజుల్లో అక్కడ ఉరుములతో కూడిన వానలు పడి వాతావరణం మరింత కూల్‌గా మారనుంది. వీటితో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అలాగే తూర్పున ఉండే బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా వాతావరణం పూర్తిగా మారిపోయి, క్రేజీగా వర్షాలు కురవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Hair Tonsuring : ఏడుకొండలవాడి సన్నిధిలో తలనీలాలు.. ఈ నల్ల బంగారం లెక్కలేంటి?

Related Articles

Back to top button